మధ్యప్రదేశ్ భోపాల్లోని గాంధీ మెడికల్ కాలేజీకు చెందిన ఇద్దరు వైద్యులు కరోనా బారిన పడినా.. విశ్రాంతి తీసుకోకుండా తమ వార్డుల్లో ఉన్న కొవిడ్ రోగులకు చికిత్స అందించారు. రోగుల దుస్థితి చూసి.. తమకు బాధ్యత పెరిగిందని వివరించారు డాక్టర్. అనురాధ చౌదరి, డాక్టర్. అనుభవ్ అగర్వాల్. వీరు రోజుకు 20 మంది కరోనా రోగులకు వైద్య చికిత్సలు చేశారు.
డాక్టర్. దేవేంద్ర, డాక్టర్. వర్థీ.. కూడా కొవిడ్ బారిన పడి వైద్య సేవలు అందించారని.. వారే తమకు స్ఫూర్తి అని వైద్యులు తెలిపారు. తమ చికిత్స వల్ల కొవిడ్ రోగుల్లో ఆత్మవిశ్వాసం, స్థైర్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు డాక్టర్. అనురాధ.
ప్రస్తుతం ఇద్దరు డాక్టర్లు క్వారంటైన్లో ఉన్నారు. రోగుల నుంచి వచ్చిన విశేష స్పందన.. తమను మానసికంగా ఉత్తేజపరచిందన్నారు.
ఇదీ చదవండి : 'ప్రోనింగ్'తో ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోండిలా..