ETV Bharat / bharat

చెత్తకుప్పలో గుట్టలుగా కొవిడ్ వ్యాక్సిన్​లు.. ఎవరి పని? - మధ్యప్రదేశ్​లో చెత్తకుప్పలో వ్యాక్సిన్​లు

మధ్యప్రదేశ్​లోని రేవా జిల్లాలో కొవిషీల్డ్​ వ్యాక్సిన్​లు (Covishield Vaccine) చెత్తకుప్పలో కనిపించాయి. దీంతో స్థానికంగా కలకలం రేగింది. సుమారు 200లకు పైగా కొవిడ్​ టీకాలు అక్కడ ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు.

Covishield Vaccine
కొవిషీల్డ్​ వ్యాక్సిన్​లు
author img

By

Published : Nov 23, 2021, 10:57 PM IST

చెత్తకుప్పలో గుట్టలుగా కొవిడ్ వ్యాక్సిన్​లు

మధ్యప్రదేశ్​ రేవా జిల్లాలోని ఓ చెత్తకుప్పలో కొవిషీల్డ్​ టీకాలు (Covishield Vaccine) దర్శనమిచ్చాయి. మౌగంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్​ వెనక భాగంలో ఉండే చెత్త కుండీలో సుమారు 200 వ్యాక్సిన్​ డోసులు కనిపించాయి. వీటి ఎక్స్​పైరీ తేదీ 2022గా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ విషయంపై వైద్యాధికారులను ప్రశ్నించగా.. వారు దాటవేసే ప్రయత్నం చేశారు.

ఈ విషయంపై మాట్లాడేందుకు ఛీప్​ మెడికల్​ ఆఫీసర్​ బీఎల్​ మిశ్రా తొలుత నిరాకరించారు. దీనిపై విచారణ అనంతరం మాట్లాడిన ఆయన.. మెడికల్​ వ్యర్థాలకు దూరంగా టీకాలను ఉంచినట్లు పేర్కొన్నారు. అదేమీ తప్పు కాదని చెప్పుకొచ్చారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరుగుతుందని హమీ ఇచ్చారు.

ఇదీ చూడండి: ల్యాబ్​లోకి వరద నీరు.. శాస్త్రవేత్తల కష్టం నీటి పాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.