ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​ బస్సు ప్రమాదంలో 54కు చేరిన మృతులు

author img

By

Published : Feb 20, 2021, 10:42 PM IST

మధ్యప్రదేశ్ సీధీ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి శనివారం మరో మృతదేహం బయటపడింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 54కి చేరింది.

MP bus tragedy: All 54 bodies found, search operation ends
ఎంపీ బస్సు ప్రమాదంలో 54కి చేరిన మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్​ సీధీ జిల్లాలోని పట్నా గ్రామంలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 54కు చేరింది. చివరగా తప్పిపోయిన వ్యక్తి మృతదేశాన్ని కాలువ నుంచి తీయడంతో గాలింపు చర్యలు ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన ఈ నెల 16న జరిగింది. ఘటన జరిగే సమయంలో బస్సులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నారు. అప్పుడే ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు.

అరవింద్ విశ్వకర్మ అనే వ్యక్తి మృతదేహాన్ని చివరిగా ప్రమాద స్థలం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు సీధీ కలెక్టర్ రవీంద్ర కుమార్ శర్మ తెలిపారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి అయిదు రోజుల పాటు సహాయ చర్యలు కొనసాగాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని విచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.