ETV Bharat / bharat

MP Avinash: ఎంపీ అవినాష్​ ముందస్తు బెయిల్​ పిటిషన్​పై విచారణ​.. రేపటికి షెడ్యూల్​

MP Avinash Bail Petition Enquiry: వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్​ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఉత్కంఠ రేపుతోంది. నిన్న జరగాల్సిన విచారణ నేటికి.. నేడు జరగాల్సింది రేపటికి వాయిదా పడింది.

MP Avinash Bail Petition Enquiry
MP Avinash Bail Petition Enquiry
author img

By

Published : Apr 26, 2023, 12:22 PM IST

MP Avinash Bail Petition Enquiry: మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్​ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. ఎందుకంటే ఇవాళ్టి జాబితాలో అవినాష్‌రెడ్డి పిటిషన్ లేదు. అయితే నేడు విచారణ జరుపుతామని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులకు మంగళవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టు మొదలవగానే పిటిషన్‌పై విచారణ జరపాలని అవినాష్‌ రెడ్డి న్యాయవాదులు హైకోర్టు న్యాయమూర్తిని కోరారు. ఇవాళ జాబితాలో లేని కేసులపై విచారణ చేపట్టలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో రేపు విచారణ చేపట్టాలని కోరగా.. అందుకు న్యాయమూర్తి సమ్మతించారు. రేపు మధ్యాహ్నం మూడన్నర గంటలకు విచారణ చేపడతామని తెలిపారు. తమ న్యాయవాదులు అందుబాటులో లేనందున ఎల్లుండి వాదనలకు అనుమతించాలని సునీతా రెడ్డి తరఫు న్యాయవాదులు విన్నవించారు. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డికి గతంలో తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉపశమనం కల్పించగా.. ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అలాంటి ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది.

కనీసం 24 గంటలపాటు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న అవినాష్‌రెడ్డి న్యాయవాదుల విజ్ఞప్తినీ తోసిపుచ్చింది. విచారణలో భాగంగా ముందుగానే లిఖిత పూర్వక ప్రశ్నలు అందించాలన్న అంశాన్నీ తప్పుబట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి పిటిషన్​పై మంగళవారమే తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుందని భావించారు. అయితే విచారణ జాబితాలో పిటిషన్ లేకపోవడంతో ఎప్పుడు విచారణకు వస్తుందో తెలియడం లేదు.

నిన్న జరగాల్సింది.. రేపటికి వాయిదా: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరపాల్సి ఉంది. అయితే హైకోర్టులో నిన్న విచారణ జాబితాలో అవినాష్ పిటిషన్ చివర్లో ఉండగా.. త్వరగా విచారణ జరపాలని అవినాష్ తరఫు న్యాయవాదులు కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీను హైకోర్టు న్యాయమూర్తి అడగగా.. అది ఇంకా అందలేదని అవినాష్ న్యాయవాది తెలిపారు.. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. సుప్రీం ఉత్తర్వుల ప్రతి లేకుండా విచారణ ఎలా జరుగుతుందని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకే తదుపరి విచారణ ఉంటుందని స్పష్టం చేసింది. జరిగిన పరిణామాల అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈరోజుకి వాయిదా వేసింది. ఈరోజన్న విచారణ జరుగుతుందని అవినాష్​ లాయర్లు ఆశాభావం వ్యక్తం చేసినా.. నేటి విచారణ జాబితాలో అవినాష్​ పిటిషన్​ లేకపోవడంతో రేపు మధ్యాహ్నం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

అవినాష్​ ముందస్తు బెయిల్​ పిటిషన్​పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేయడం.. ఈ నెల 25న జరగాల్సిన అవినాష్​ విచారణ రోజురోజుకి వాయిదా పడుతుండడంతో ఏం జరుగుతుందో అనే టెన్షన్​ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆసక్తి నెలకొంది.

ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా: మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిసాయి. సీబీఐ పిటిషన్‌పై తీర్పును ఉన్నత న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.