ETV Bharat / bharat

కుమారుడికి డీఎన్​ఏ టెస్టు చేయిస్తానన్న తండ్రి.. గొంతునులుమి చంపిన తల్లి - బిహార్ న్యూస్​

Mother Kills Her Children: కన్న తల్లే చిన్నారిని హత్య చేసిన ఘటన బిహార్​ అనుప్పూర్​లో జరిగింది. కుమారుడు తనకు పుట్టలేదని డీఎన్​ఏ టెస్టు చేయిస్తానని భర్త చెప్పగా.. ఈ దారుణానికి పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసుల నిందితురాలిని అరెస్ట్​ చేశారు.

Mother Kills Her Children
anuppur latest news
author img

By

Published : Apr 6, 2022, 9:35 PM IST

Mother Kills Her Children: బిహార్​ అనుప్పూర్​లో దారుణం జరిగింది. కన్న తల్లే చిన్నారిని హత్య చేసింది. బిజూరికి చెందిన పుష్ప.. ఏడాదిన్నర వయసు గల కుమారుడిని గొంతు నులుమి చంపింది. డీఎన్ఏ రిపోర్టు రాకుండా ఉండేందుకే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితురాలిని అరెస్ట్​ చేశారు.
ఇదీ జరిగింది: బిజూరికి చెందిన సంజీత్​ ప్యాంట్రీ కాంట్రాక్టర్​. ​ 2016లో పుష్పతో వివాహం జరగగా.. 4 ఏళ్ల కుమార్తె, ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. అయితే కొడుకు అవినాష్​ తనకు పుట్టలేదని భార్యపై అనుమానం వ్యక్తం చేసేవాడు. ఈ విషయంపై ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవి. కుమారుడికి డీఎన్​ఏ పరీక్ష చేయిస్తానని సంజీత్​ చెప్పాడు. దీంతో అవినాష్​ను గొంతు నులుమి హత్య చేసింది పుష్ప. ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో అవినాష్​ పరిస్థితి విషమించడం వల్ల ఆస్పత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం శవపరీక్ష నివేదిక రావడం వల్ల హత్యగా తేలింది.

ఇదీ చదవండి: మనిషితో ముంగిస దోస్తీ.. ఎక్కడికి వెళ్లినా అతడితోనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.