ETV Bharat / bharat

ప్రపంచంలో అత్యంత ఆరాధించే వ్యక్తుల్లో మోదీకి 8వ స్థానం - ఆరాధించే వ్యక్తుల్లో మోదీ పేరు ఉందా?

ప్రపంచంలో అత్యంత ఆరాధించే వ్యక్తుల్లో 8వ స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. యూ-గవ్ డేటా అనలిటిక్స్ అనే కంపెనీ నిర్వహించిన సర్వే-2021 ఫలితాలను బుధవారం వెల్లడించింది. ఈ జాబితాలో టాప్‌-20లో అమితాబ్‌, షారూక్‌, సచిన్, విరాట్ కోహ్లీ.. మహిళల జాబితాలో ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్‌, సుధామూర్తి స్థానం సంపాదించారు.

PM Modi
మోదీ
author img

By

Published : Dec 15, 2021, 10:38 PM IST

ప్రపంచంలోనే అత్యంత ఆరాధించే వ్యక్తులపై యూ-గవ్ డేటా అనలిటిక్స్ కంపెనీ నిర్వహించిన సర్వేలో 2021 ఏడాదికి గానూ ప్రధాని మోదీ 8వ స్థానంలో నిలిచారు. ప్రధానితోపాటు టాప్‌-20లో బాలీవుడ్ నటులు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్, షారూక్‌ ఖాన్ సహా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, టీమిండియా టెస్టుకెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నారు.

ఈ జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మెుదటి 3 స్థానాలు దక్కించుకున్నారు.

మహిళల జాబితా టాప్‌-20లో బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్‌తోపాటు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి ఉన్నారు. మిషెల్లీ ఒబామా, ఏంజెలీనా జోలీ, క్వీన్‌ ఎలిజబెత్-2 తొలి 3 స్థానాలు దక్కించుకున్నారు. 38 దేశాల్లోని 42 వేల మందిని సర్వే చేసి యూ-గోవ్‌ ఫలితాలను వెల్లడించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.