ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరిలో (Lakhimpur Kheri News) జరిగిన హింసాత్మక ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా (Ashish Mishra Bjp).. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు న్యాయబద్ధంగానే జరుగుతుందని హామీ ఇచ్చారు. నార్త్ బ్లాక్‌లో ఉన్న తన కార్యాలయంలో ఎప్పటిలానే విధులకు హాజరైన ఆయన.. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. లఖింపుర్ ఖేరి ఘటనపై వివరించినట్లు తెలిపారు.
లఖింపుర్లో హింస జరుగుతున్న (Lakhimpur Violence News) సమయం తాను కానీ.. తన కుమారుడు కానీ ఆ ప్రాంతంలో లేమని చెప్పారు. విచారణలో భాగంగా ఏ ప్యానెల్ ముందైనా తాను హాజరుకావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అన్నీ కోణాల్లో కేసును దర్యాప్తు చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
"లఖింపుర్ ఖేరిలో హింస చెలరేగినప్పుడు నేను, నా కుమారుడు ఆ ప్రాంతంలో లేము. మా కారు వేరే మార్గంలో వెళ్లింది. దీనిపై ఏ విచారణ ప్యానెల్ ముందు హాజరుకావడానికైనా సిద్ధంగా ఉన్నాను. నిందితులు ఎవరైతే వారి మీద కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ కేసులో దాగి ఉన్న కుట్రను బయట పెట్టేందుకు దర్యాప్తు సంస్థలు తన పని ప్రారంభించాయి. ఈ కేసు విచారణలో ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేదు."
- అజయ్ మిశ్రా, కేంద్ర మంత్రి
ఎఫ్ఐఆర్లో మీ పేరు చేర్చారా లేదా ? అనే ప్రశ్నకు సమాధానంగా' చట్టపరమైన ప్రక్రియ నాకు తెలుసు. ఈ విషయంలో సాధారణ పౌరుడిలాగా అనుసరిస్తానని నేను హామీ ఇస్తున్నాను' అని అన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వీటికి కూడా బదులు ఇచ్చారు మంత్రి. 'ప్రపంచవ్యాప్తంగా దేశంపై గౌరవం పెరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Pm Modi News), భాజపాలకు ఆదరణ రెట్టింపు అయ్యింది. దీనిని చూసి ఓర్వలేని ప్రతిపక్షపార్టీలు.. అనవసర రాద్దాంతం చేస్తున్నాయి' అని అన్నారు.
ఆహ్వానాన్ని వెనక్కి తీసుకొన్న అధికారులు...
బ్యూరో ఆఫ్ పోలీస్ రీసర్చ్ అండ్ డెవలెప్మెంట్ (బీపీఆర్డీ) ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన అజయ్ మిశ్రా.. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆయనకు ఇచ్చిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఆశిష్ మిశ్రా(Ashish Mishra Bjp) కారు రైతులపైకి దూసుకెళ్లినట్లు ఎఫ్ఐఆర్లో స్పష్టం చేశారు ఉత్తర్ప్రదేశ్ పోలీసులు. అంతేకాక రైతులపై మిశ్రా.. కాల్పులు జరిపారని, పథకం ప్రకారమే ఈ ఘటన జరిగినట్లు ఎఫ్ఐఆర్లో వివరించారు.
ఇదీ చూడండి: 'లఖింపుర్ ఘటనతో రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ యత్నం'