ETV Bharat / bharat

వీధి కుక్కలకు విషం పెట్టి హత్య.. 12 శునకాలు మృతి - dozen stray dogs poisoned to death

వీధి శునకాలకు విషం (Dog Poison) పెట్టి చంపేశాడు ఓ వ్యక్తి. పన్నెండు కుక్కలు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై జంతు హింస నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.

More than a dozen stray dogs poisoned to death
వీధి కుక్కలకు విషం పెట్టి హత్య
author img

By

Published : Sep 23, 2021, 3:26 PM IST

Updated : Sep 23, 2021, 3:51 PM IST

వీధి కుక్కలకు విషం పెట్టి హత్య.. 12 శునకాలు మృతి

ఒడిశాలో ఓ వ్యక్తి మూగజీవాలకు విషం (Dog Poison) పెట్టి ప్రాణాలు తీశాడు. పన్నెండు వీధి కుక్కలను ఇలా చంపేశాడు. కటక్​లోని శంకర్​పుర్​ ప్రాంతంలో (Cuttack Odisha) స్ట్రీట్ ఫుడ్ విక్రయించే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. జంతు హింస నిరోధక చట్టం (Prevention of Cruelty to Animals Act) కింద కేసు నమోదు చేశారు.

More than a dozen stray dogs poisoned to death
చనిపోయిన శునకాలు

గత మూడు రోజుల నుంచి శునకాలు మృతి చెందుతున్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించారు. మరణించిన శునకాల దేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, కుక్కలకు విషం పెట్టి చంపడానికి గల కారణాలు తెలియలేదు.

విగతజీవిగా వీధి శునకం...

శునకాల మృతదేహాలను శవపరీక్షల కోసం పంపించారు. మొత్తం పన్నెండు వీధి కుక్కలకు విషం పెట్టినట్లు నిర్ధరించారు అధికారులు. అయితే ఈ సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని జంతు హక్కుల పరిరక్షణ ఫోరం చెబుతోంది. విషాహారం తిని అనారోగ్యంపాలైన వాటిని భువనేశ్వర్​లోని ఆస్పత్రికి తరలించింది.

చనిపోయిన శునకం...

ఇదీ చదవండి: తుపాకీతో బెదిరించి.. బాలికపై గ్యాంగ్​రేప్​

Last Updated : Sep 23, 2021, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.