ETV Bharat / bharat

700 మంది నక్సల్స్​కు సీక్రెట్​గా కరోనా టీకా- ఎలాగంటే... - నక్సలైట్లు కరోనా టీకాలు

Naxalites corona vaccine: నక్సలైట్లకు కూడా కరోనా టీకాలు అందాయి. దాదాపు 700మందికిపైగా నక్సల్స్​ కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ నుంచి వీరికి టీకాలతో పాటు చికిత్సకు కావాల్సిన ఔషధాలు వీరికి చేరాయి. పోలీసుల ఎదుట ఇటీవలే లొంగిపోయిన ఇద్దరు నక్సల్స్​ ఈ వివరాలను బయటపెట్టారు.

naxalites corona vaccine
700 మంది నక్సల్స్​కు సీక్రెట్​గా కరోనా టీకా- ఎలాగంటే...
author img

By

Published : Dec 3, 2021, 3:02 PM IST

Naxalites corona vaccine: ఛత్తీస్​గఢ్​లోని దట్టమైన అడవుల్లో ఉండే నక్సలైట్లకు కూడా కరోనా భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 700మందికిపైగా నక్సల్స్​.. ఇప్పటికే కరోనా టీకాలు తీసుకున్నట్టు సమాచారం. గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయిన పొజ్జో, లఖ్కె అనే ఇద్దరు నక్సలైట్లు.. ఈ విషయాన్ని బయటపెట్టారు.

కరోనా రెండో దశలో.. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ నుంచి నక్సల్స్​కు టీకాలు, ఔషధాలు అందినట్టు పొజ్జో చెప్పాడు. నక్సలైట్ల దక్షిణ విభాగానికి చెందిన వైద్యులు తమకు చికిత్స అందిస్తున్నారని స్పష్టం చేశాడు. హిద్మా, సుజాత, వికాశ్​, రఘుతో పాటు అనేకమంది నక్సల్స్​ అగ్రనేతలు కూడా వ్యాక్సిన్లు తీసుకున్నట్టు తెలిపాడు. ఛత్తీస్​గఢ్​లోని టీకాలపై అనుమానంతోనే.. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాక్సిన్లు తెప్పించుకున్నట్టు వెల్లడించాడు.

ఈ క్రమంలోనే నక్సలైట్ల ఆరోగ్య పరిస్థితులపై కీలక సమాచారం అందించాడు పొజ్జో. దక్షిణ బస్తర్​ విభాగం ఇన్​ఛార్జ్​ రఘుతో పాటు మాసా బెటాలియన్​ కమాండర్​ రాజేశ్​.. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు చెప్పాడు. వారికి కరోనా సోకి ఉండవచ్చని అన్నాడు. వారు కర్రల సహాయంతో నడుస్తున్నట్టు, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొన్నాడు. రఘు తలపై రూ.25 లక్షల రివార్డు ఉంది.

ఈ వ్యవహారంపై ఎస్​పీ అభిషేక్​ పల్లవ్​ స్పందించారు. నక్సలైట్లు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. వారికి మెరుగైన చికిత్స అందించి, ప్రాణాలు రక్షిస్తామని హామీనిచ్చారు.

ఎవరీ పొజ్జో, లఖ్కె?

పొజ్జో, లఖ్కె.. భార్యాభర్తలు. వీరి అసలు పేర్లు సంజు మాద్వి- తులసి మాద్వి. 70మంది జవాన్ల హత్యలతో వీరికి సంబంధం ఉంది. భద్రతా దళాలపై జరిగిన 12 దాడుల్లో వీరి హస్తం కూడా ఉంది. గతంలో వీరిపై రూ. 5లక్షల రివార్డు ప్రకటించారు. నక్సలైట్లు జనజీవనంలో కలిసిపోయేందుకు కృషి చేయడం కోసం ప్రభుత్వం చేపట్టిన 'లోన వర్రటు అభియాన్​'లో భాగంగా వీరు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

naxalites corona vaccine
లొంగిపోయిన నక్సల్స్​ దంపతులు

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.