MLA In Bigg Boss : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌లోకి వెళ్లారు. ఆదివారం ప్రారంభమైన బిగ్‌బాస్ 10 సీజన్‌కు చిక్కబళ్లాపుర్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ పోటీదారుగా ప్రవేశించారు. మొత్తం 19 మంది బిగ్‌బాస్ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల కాగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డోలు వాయిద్యాలతో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్‌ను చూసిన పోటీదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీనిపై స్పందించిన ప్రదీప్.. తాను ప్రారంభ కార్యక్రమానికే రావాల్సి ఉందన్నారు. బిగ్‌బాస్‌లోకి పోటీదారుడిగా రావడం ఆనందంగా ఉందని చెప్పారు.
Bigg Boss Kannada Season 10 Contestants : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.. బిగ్‌బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్లో ప్రదీప్ ఈశ్వర్‌తో పాటు కన్నడ టీవీ నటి నమ్రత, చార్లీ 777 నటి సంగీత తదితరులు పాల్గొన్నారు. అయితే, ఓ ఎమ్మెల్యే.. బిగ్‌బాస్ లాంటి షోకు వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆయనపై పెద్ద చర్చ నడుస్తోంది. మరోవైపు.. ప్రదీప్ సన్నిహితులు మాత్రం.. అనాథల సంక్షేమం కోసమే బిగ్‌బాస్‌లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. బిగ్‌బాస్‌లో వచ్చిన ఆదాయం మొత్తం తల్లిదండ్రులు లేని చిన్నారుల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. వాస్తవానికి ప్రదీప్ ఈశ్వర్.. బిగ్‌బాస్ ప్రారంభం రోజే వెళ్లాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల మరుసటి రోజు అడుగుపెట్టారు. ఈశ్వర్ బిగ్‌బాస్‌లో పోటీదారుడిగా కొనసాగుతాడా? లేదా మధ్యలోనే బయటకు వచ్చేస్తాడా? అన్నది తేలాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.
మాజీ మంత్రి సుధాకర్‌పై గెలుపు
Pradeep Eshwar MLA Karnataka : ఈ ఏడాది జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో చిక్కబళ్లాపుర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రదీప్ ఈశ్వర్. బీజేపీకి చెందిన అభ్యర్థి, మాజీ మంత్రి డాక్టర్ కే సుధాకర్‌పై 11,318 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సుధాకర్‌కు 61,847 ఓట్లు రాగా.. ఈశ్వర్‌కు 73,165 ఓట్లు వచ్చాయి.
Bigg Boss Subhashree : బిగ్‌బాస్ హౌస్ నుంచి క్యూటీ ఔట్.. 5వారాలకు ఎంత ఛార్జ్ చేసిందో తెలుసా?