ETV Bharat / bharat

ముంబయికి చేరుకున్న 'విశ్వసుందరి' హర్నాజ్​ సంధు

Miss Universe 2021: మిస్​ యూనివర్స్​ కిరీటం గెలుచుకున్న హర్నాజ్​ సంధు భారత్​కు చేరుకుంది. బుధవారం ముంబయి విమానాశ్రయంలో అడుగుపెట్టిన సంధుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

author img

By

Published : Dec 16, 2021, 5:47 AM IST

Updated : Dec 16, 2021, 10:52 AM IST

miss universe 2021
ముంబయికి చేరుకున్న 'విశ్వసుందరి' హర్నాజ్​ సంధు
ముంబయికి చేరుకున్న 'విశ్వసుందరి' హర్నాజ్​ సంధు

Miss Universe 2021: ఇటీవల మిస్​ యూనివర్స్​-2021 కిరీటాన్ని దక్కించుకున్న హర్నాజ్​ సంధు బుధవారం ముంబయి చేరుకుంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయం వద్ద హర్మాజ్​కు ఘన స్వాగతం పలికారు అభిమానులు. బదులుగా జాతీయ జెండా ఊపుతూ అభివాదం చేసింది సంధు.

ఇజ్రాయెల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 80 దేశాల నుంచి ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. వారందరినీ వెనక్కినెట్టి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది 21 ఏళ్ల హర్నాజ్​ సంధు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్​కు ఈ టైటిల్ దక్కింది. భారత్​ తరపున మిస్​యూనివర్స్​ కిరీటం దక్కించుకున్న మూడో వ్యక్తిగా నిలిచింది సంధు. అంతకుముందు 1994లో సుస్మితా సేన్​, 2000లో లారా దత్తా ఈ ఘనతను పొందారు.

ఇదీ చూడండి : సీన్​ రివర్స్​- వరుడి ఇంటికి గుర్రంపై వెళ్లిన పెళ్లికూతురు

Last Updated : Dec 16, 2021, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.