ETV Bharat / bharat

పూరీ ఆలయంలో బాలిక​పై లైంగిక వేధింపులు- పూజారి అరెస్ట్ - పూజారి దారుణం

పూరీ జగన్నాథుడి ఆలయంలో దారుణం జరిగింది. దైవ దర్శనం కోసం వచ్చిన బాలికపై ఆలయంలో పని చేసే ఓ పూజారి లైంగిక వేధిపులకు పాల్పడ్డాడు.

Puri Jagannath Temple Girl Molested
పూరీ ఆలయంలో బాలిక​పై లైంగిక వేధింపులు
author img

By

Published : Oct 10, 2021, 9:05 AM IST

ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి ఆలయంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయంలో పని చేసే ఓ పూజారి మైనర్​పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఏం జరిగింది?

శ్రీ జగన్నాథ ఆలయ దర్శనం కోసం ఓ బాలిక శుక్రవారం మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది. ఆలయ ప్రాంగణంలోని వామన్ మందిరంలో బాలిక దర్శనం కోసం వెళ్లగా.. ఓ పూజారి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బాధిత బాలిక కుటుంబ సభ్యులు పూరీలోని సింఘాడ్వాడ్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పిల్లల సంరక్షణ కమిటీ(సీడబ్ల్యూసీ) అధికారులు.. బాలిక వాంగ్మాలాన్ని నమోదు చేశారు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: 17 ఏళ్ల బాలికపై ప్రియుడు సహా ఏడుగురు అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.