ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న ఓ మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు కామాంధులు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆ బాలిక విషం తాగి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌లో వెలుగుచూసింది.
సార్ధానా కొత్వాలి ప్రాంతానికి చెందిన ఈ బాలిక గురువారం సాయంత్రం విషం తాగిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు స్పష్టం చేశారు.
నలుగురు యువకులు తనను అత్యాచారం చేసినట్లు బాధితురాలు సూసైడ్ నోట్లో పేర్కొందని మేరఠ్ రూరల్ ఎస్పీ కేశవ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి లఖన్, వికాస్ అనే ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
కుటుంబ సభ్యులతో చెప్పాకే..
గురువారం సాయంత్రం తీవ్ర గాయాలతో ఇంటికి చేరుకున్న బాధితురాలు... తనపై జరిగిన అత్యాచారం గురించి కుటుంబ సభ్యులతో చెప్పుకుంది. తర్వాత విషం తాగింది.
ఇదీ చదవండి:రాత్రికి 'మహా' సీఎం ప్రసంగం- లాక్‌డౌన్‌పై ప్రకటన?