ETV Bharat / bharat

Sircilla Jawan Death: హెలికాప్టర్ క్రాష్​లో సిరిసిల్ల జవాన్ మృతి.. కేటీఆర్ సంతాపం - Minister KTR condoles death of jawan

Minister KTR Condoles Death of Jawan Anil: జమ్మూకశ్మీర్‌లో గురువారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన జవాన్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ అనిల్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు. జవాన్​ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Jawan Anil Death
Jawan Anil Death
author img

By

Published : May 5, 2023, 1:24 PM IST

Minister KTR Condoles Death of Jawan Anil: జమ్మూకశ్మీర్‌లో హెలికాప్టర్​ ప్రమాదంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన జవాన్‌ అనిల్ మృతి చెందడం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. జవాన్‌ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే అనిల్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసాని ఇచ్చారు. మరోవైపు అనిల్ మరణంపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ స్పందించారు. జవాన్​ అనిల్‌ మృతి బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా అనిల్ మృతిపై సంతాపం తెలిపారు.

జవాన్‌ అనిల్
జవాన్‌ అనిల్

అసలు ఏమైందంటే: భారత సైన్యానికి చెందిన ధ్రువ్ హెలికాప్టర్‌ గురువారం ఉదయం ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్​లో సాంకేతిక లోపం తలెత్తడంతో జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లా అటవీ ప్రాంతంలో.. దించేందుకు ప్రయత్నిస్తుండగా కుప్పకూలిపోయింది. మరువా నదీతీరాన క్షతగాత్రులను, హెలికాప్టర్‌ శకలాలను స్థానికులు గుర్తించారు. ఆర్మీ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని.. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాలవారు కూడా వారికి సహకరించారు. ఈ ప్రమాదంలో సాంకేతిక నిపుణుడు పబ్బాల అనిల్‌(29) మృతి చెందగా, మరో ఇద్దరు గాయలపాలయ్యారు. మృతి చెందిన అనిల్‌ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి అని అధికారులు తెలిపారు.

Sircilla Jawan died in Helicopter Crash : జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన సీఎఫ్‌ఎన్‌ ఏవీఎన్‌ టెక్నీషియన్‌ పబ్బాల అనిల్‌(29) మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన పబ్బాల మల్లయ్య, లక్ష్మీ దంపతులు. వారి కుమారుడైన అనిల్ డిగ్రీ పూర్తి చేశారు. గత పదకొండేళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. అనిల్​కు బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన సౌజన్యతో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు.. అయాన్‌, అరవ్‌ ఉన్నారు.

గ్రామంలో విషాదఛాయలు: నెల రోజుల క్రితం జవాన్​ అనిల్‌ స్వగ్రామానికి వచ్చారు. చిన్న కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లోనూ.. అలాగే అత్తగారి గ్రామం కోరెంలో జరిగిన బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. 10 రోజుల క్రితమే తిరిగి తమ విధులకు వెళ్లారు. ఇంతలోనే అనిల్ మరణించాడన్న వార్త తెలిసి అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనిల్ మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రానికి స్వగ్రామానికి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.