ETV Bharat / bharat

ఎగ్జిట్ పోల్స్‌పై కేటీఆర్ సీరియస్ - 100 శాతం అధికారంలోకి వస్తామని ధీమా

Minister KTR Comments on Telangana Elections : తెలంగాణ ఎగ్జిట్ పోల్స్​ అంచనాలకు భిన్నంగా.. తెలంగాణ ఫలితాలు వస్తాయని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 2018లో బీఆర్ఎస్​కు 50 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు చెప్పలేదని గుర్తుచేశారు. అప్పుడు ఫలితాలు ఎలా వచ్చాయో ప్రజలే చూశారన్నారు. ఈసారి కూడా రాష్ట్రంలో 100 శాతం అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Minister KTR
Telangana Elections
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 6:51 PM IST

Updated : Nov 30, 2023, 7:40 PM IST

'ఎగ్జిట్ పోల్స్‌పై కేటీఆర్ సీరియస్ - 100 శాతం అధికారంలోకి వస్తాం'

Minister KTR Comments on Telangana Elections : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) అసంతృప్తి వ్యక్తం చేశారు. 2018లో ఎగ్జిట్ పోల్స్​లో ఒక్క సంస్థ మాత్రమే సరిగా చెప్పిందని పేర్కొన్నారు. 2018లోనూ టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఓడిపోతుందని చాలా సంస్థలు చెప్పాయన్నారు. అప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు అన్నీ తప్పాయని గుర్తుచేశారు. అప్పుడు ఫలితాలు ఎలా వచ్చాయో.. ఈసారి కూడా అలాంటి ఫలితాలే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Telangana Elections Polling 2023 : ఎగ్జిట్‌ పోల్స్ తమకు వ్యతిరేకంగా ఉండటం ఇదే తొలిసారి కాదని మంత్రి స్పష్టం చేశారు. ఈసారి 80కి పైగా స్థానాలు వస్తాయని అనుకున్నామని.. కానీ 70 వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌కు అంత శాస్త్రీయ ఉందని అనుకోవట్లేదని చెప్పారు. పోలింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్‌ పోల్స్ సర్వే(Exit Polls Survey) జరుగుతుందని వెల్లడించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి కార్యకర్తలు ఆందోళన చెందవద్దని మంత్రి కేటీఆర్ సూచించారు.

'2018లో ఎగ్జిట్ పోల్స్​లో ఒక్క సంస్థ మాత్రమే సరిగా చెప్పింది. 2018లోనూ టీఆర్ఎస్ ఓడిపోతుందని చాలా సంస్థలు చెప్పాయి. 2018లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు అన్నీ తప్పాయి. ఎగ్జిట్‌ పోల్స్ మాకు వ్యతిరేకంగా ఉండటం ఇదే తొలిసారి కాదు. 80కి పైగా స్థానాలు వస్తాయని అనుకున్నాం.. కానీ 70 వస్తాయి. ఎగ్జిట్‌ పోల్స్‌కు అంత శాస్త్రీయత ఉందని అనుకోవట్లేదు. పోలింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్‌ పోల్స్ సర్వే జరుగుతుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి కార్యకర్తలు ఆందోళన చెందవద్దు. ఏ ఎగ్జిట్ పోల్స్ వూహించని విధంగా ఫలితాలు ఉంటాయి.' -కేటీఆర్, మంత్రి

పార్టీ కండువాలతో పోలింగ్​ కేంద్రాలకు పలువురు ఎమ్మెల్యేలు - మంత్రి ఇంద్రకరణ్​రెడ్డిపై కేసు నమోదు

Minister KTR on Telangana Assembly Elections Voting 2023 : ఓటర్లు ఇంకా పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. డిసెంబర్ 3న 70 కంటే ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ​కు తప్పక వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వే సంస్థల ఎగ్జిట్​ పోల్స్​ను ప్రజలు నమ్మొద్దని భరోసా కోరారు. బీఆర్ఎస్​ కార్యకర్తలు, నాయకులు గందరగోళానికి గురి కావొద్దని సూచించారు. తెలంగాణలో 100 శాతం అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినప్పటి నుంచి రెండు నుంచి మూడు నెలల పాటు కష్టపడిన ప్రతి ఒక్కరికీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

'2018లో బీఆర్ఎస్​కు 50 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు చెప్పలేదు. ఓటర్లు ఇంకా పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారు. డిసెంబర్ 3న 70 కంటే ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్​కు తప్పక వస్తాయి. సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్​ను నమ్మొద్దు. కార్యకర్తలు, నాయకులు గందరగోళానికి గురి కవొద్దు. 100 శాతం అధికారంలోకి వస్తాం'. -కేటీఆర్, మంత్రి

ఉమ్మడి వరంగల్​లోని పలు​ పోలింగ్​ కేంద్రాల్లో ఉద్రిక్తతలు - పోలీసుల లాఠీ ఛార్జీ

ఓటేసిన రాజకీయ ప్రముఖులు - విద్యావంతులంతా తమ బాధ్యత నిర్వర్తించాలని పిలుపు

Last Updated : Nov 30, 2023, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.