ఉత్తర్‌ప్రదేశ్ ఔరయాలో(Uttar pradesh bus accident) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీసీసీ పరీక్ష(CCC Exam) పేపర్లను పరీక్షా కేంద్రంలో అందించి, తిరిగి వెళ్తున్న ఓ మినీ బస్సు.. ఓవర్ బ్రిడ్జిపై(mini bus accidet in auraiya) లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
అసలేం జరిగింది?
ఆదివారం ఉదయం 6 గంటలకు ఛతర్పుర్లోని సీసీసీ పరీక్షా కేంద్రానికి పేపర్లను అందించి, మూడు బస్సులు.. ఇటావా వైపు తిరిగి వెళ్తున్నాయి. ఈ క్రమంలో ప్రతాప్పుర్ వద్ద అజీత్మల్ కొత్వాలీ ప్రాంతంలో.. ఓ బస్సు ఓవర్‌బ్రిడ్జిపై లారీని ఢీకొట్టింది. దీంతో ఆ బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మిగతా రెండు బస్సుల్లో వస్తున్న విద్యార్థులు.. గాయపడ్డవారిని సఫాయిలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి తాము చేరుకున్నామని అజీత్మల్ సీఓ ప్రదీప్ కుమార్ తెలిపారు. క్షతగాత్రుల్లో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Nipah Virus: మళ్లీ నిఫా కలకలం.. ఆ గబ్బిలాలే కారణమా?