జమ్ముకశ్మీర్‌లో ఓ వ్యాపారి హత్యకు కుట్రపన్నిన ఉగ్రవాది గురువారం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. బారాముల్లా జిల్లా (Kashmir Encounter) చెర్దరీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ముష్కరుడి నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
చెర్దరీలో ఉగ్రవాది ఉన్నట్లు సమాచారం (Kashmir Encounter) అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ముష్కరులు అధికారులపై కాల్పులు జరపగా.. ఎదురుకాల్పుల్లో ఒక మిలిటెంట్ హతమయ్యాడు. మిగిలిన వారు పరారయ్యారని అధికారులు వెల్లడించారు.
మృతిచెందిన మిలిటెంట్ కుల్గామ్‌కు చెందిన జావెద్ వానీగా గుర్తించారు. ఇటీవల వాన్పోహ్ ప్రాంతంలో బిహార్‌కు చెందిన వలస కార్మికులపై కాల్పులకు తెగబడ్డ తీవ్రవాది గుల్జర్కు ఇతను సహకారం అందించాడని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వానీ బారాముల్లాలోని ఓ వర్తకుడిని హతమార్చేందుకు కుట్ర పన్నాడని తెలిపారు.
ఇదీ చూడండి : rajya sabha news: ప్రజలకు మరింత చేరువగా పెద్దల సభ