ETV Bharat / bharat

'దిల్లీలో ఆక్సిజన్​ కొరత లేకుండా చూస్తున్నాం'

దిల్లీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్​ కొరత లేకుండా చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇందుకోసం తగు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

supply of oxygen, Delhi hospitals
'దిల్లీలో ఆక్సిజన్​ కొరత లేకుండా చూస్తున్నాం'
author img

By

Published : Apr 21, 2021, 12:07 AM IST

Updated : Apr 21, 2021, 12:22 AM IST

దిల్లీలో ఆసుపత్రులకు ఆక్సిజన్​ కొరత లేకుండా చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇందుకోసం తగిన చర్యలను చేపట్టినట్లు పేర్కొన్నారు. దేశ రాజధానిలో కరోనా రోగుల చికిత్సకోసం ఉపయోగించే ఆక్సిజన్​ కేవలం కొన్ని గంటలకు సరిపోయే అంత మాత్రమే ఉందంటూ అక్కడి ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్ అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రాన్ని ఎంత వేడుకున్నా చేతులు ముడుచుకు కూర్చొందని ఆరోపించారు.

దీనిపై స్పందించిన అధికారులు ఆక్సిజన్​ కొరతపై వివరణ ఇచ్చారు. దిల్లీలో ఆక్సిజన్​ కొరత ఏమాత్రం లేదని పేర్కొన్నారు. మెడికల్​ ఆక్సిజన్​ను అందుబాటులో ఉంచడానికి చేపట్టాల్సిన అన్ని చర్యలను కేంద్రం యుద్ధప్రాతిపదికన చేస్తోందని వివరించారు.

ఆక్సిజన్​ను తరిలించే వాహనాలను సరిహద్దుల్లో ఆపకుండా తగు చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. ప్రజారోగ్యానికి అవసరమైన వస్తువుల సరఫరాపై ఆంక్షలు విధించకూడదని తెలిపింది.

ఇదీ చూడండి: 'దిల్లీలో ఆక్సిజన్ కొరత.. కొన్ని గంటల్లో ఖాళీ!'

Last Updated : Apr 21, 2021, 12:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.