ETV Bharat / bharat

నిధి కోసం పూజలు.. మహిళను వివస్త్రను చేసి.. - మూఢవిశ్వాసాలు కర్ణాటక

నిధి కోసం పూజలు చేయాలంటూ ఓ మహిళను వివస్త్రను చేసి నిలబెట్టిన ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లాలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితులను అరెస్ట్​ చేశారు. ఇందులో ఓ ఆలయ పూజారి ఉన్నాడు.

karnataka news latest
నిధి కోసం పూజలు.. మహిళను వివస్త్రను చేసి..
author img

By

Published : Nov 12, 2021, 1:58 PM IST

​భూమిలోంచి నిధి వస్తుందని నమ్మిన పలువురు పూజలు ప్రారంభించారు. ఆ సమయంలో ఓ మహిళను వివస్త్రను చేసి నిలబెట్టారు. మూడవిశ్వాసాలు ఇంకా గ్రామాల్లో రాజ్యమేలుతున్నాయి అనడానికి ఉదాహరణ ఈ ఘటన. కర్ణాటకలోని రామనగర జిల్లా భుహల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని తమిళనాడుకు చెందిన పార్థసారధి, నాగరాజు, శశికుమార్, లోకేశ్​, మోహన్​, లక్ష్మీ నర్సప్పలుగా అధికారులు గుర్తించారు.

శశికుమార్​ ఓ ఆలయ పూజారి కావడం గమనార్హం.

karnataka news latest
నిధి కోసం తవ్వకాలు జరిపిన నిందితులు

ఇదీ జరిగింది..

సులువుగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో నిధుల వేట ప్రారంభించిన నిందితులు.. భూహల్లికి చెందిన శ్రీనివాస్​ అనే వ్యక్తిని మంగళవారం కలిశారు. అతని ఇంటి పరిసరాల్లో నిధి ఉందంటూ నమ్మించారు. భూమిలో ఉన్న నిధి బయటకు రప్పించేందుకు పూజలు చేయాలని.. అందుకు అతని భార్య ఆ సమయంలో నగ్నంగా నిల్చోవాలని చెప్పాడు పూజారి శశికుమార్​. అందుకు శ్రీనివాస్​ అంగీకరించగా.. అతని భార్య తిరస్కరించింది. మరో నిందితుడు పార్థసారధి రూ.50 వేలు ఇస్తానంటూ ఆశచూపేసరికి బాధితురాలు అందుకు ఒప్పుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు అదే రోజు రాత్రి శ్రీనివాస్​ ఇంటిని చేరుకోగా.. పూజలు నిర్వహిస్తున్న నిందితులు, వివస్త్రగా నిలిచిన మహిళ ఉన్నారు. నిందితులను అరెస్ట్​ చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ చూడండి : వర్షాల కోసం బాలికలను నగ్నంగా ఊరేగించి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.