సాగు చట్టాలపై రైతుల ఉద్యమానికి మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్(satyapal malik news). వీధిలో శునకం చనిపోయినా, దిల్లీ నుంచి సంఘీభావ ప్రకటనలు వస్తున్నాయి కానీ రైతుల ఉద్యమంలో(farmers protest news) 600 మంది మరణించినా, ఇప్పటికీ ఒక్క తీర్మానం కూడా చేయలేదని అన్నారు. రాజస్థాన్ జైపుర్లో జరిగిన 2021 అంతర్జాతీయ జాట్ సదస్సులో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"రైతుల ఉద్యమం గురించి మాట్లాడిన ప్రతిసారీ నా వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. నేను ఎప్పుడేం అంటానా, ఎప్పుడు నన్ను తప్పిద్దామని అని కొందరు చూస్తూ ఉంటారు. ఇద్దరు, ముగ్గురు కలిసి నన్ను గవర్నర్ను చేశారు. రైతుల ఉద్యమం గురించి నేను మాట్లాడితే వారికి నచ్చదు. వారి ఇష్టాలకు వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను. నన్ను పదవి నుంచి తప్పుకోమంటే, ఒక్క నిమిషంలో తప్పుకుంటాను. ఈ విషయాన్ని పదవి చేపట్టిన తొలి రోజు నుంచే ఆలోచిస్తున్నా, అందుకే రైతుల ఉద్యమంపై మాట్లాడుతున్నా. దేశంలో ఏ ఉద్యమం కూడా ఇంత కాలం సాగలేదు. 600మంది ఉద్యమంలో అమరులయ్యారు. వీధిలోని కుక్క చనిపోయినా, దిల్లీ నుంచి సంఘీభావం తెలుపుతున్నారు. ఇటీవలే మహారాష్ట్రలో ఏడుగురు మరణించారు. వెంటనే దిల్లీ నుంచి నివాళులర్పించారు. కానీ 600మంది రైతులు మరణించినా, వారి కోసం దిల్లీలో ఇప్పటివరకు ఒక్క తీర్మానం కూడా చేయలేదు."
-- సత్యపాల్ మాలిక్, మేఘాలయ గవర్నర్.
రైతుల ఉద్యమం సైనికులపైనా ప్రభావం చూపిస్తోందన్నారు మాలిక్. శక్తితో, గర్వంతో ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారని, భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ఆలోచించడం లేదని ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి:- ' రెండు సంతకాలు చేస్తే.. రూ.300 కోట్లు ఇస్తామన్నారు'