ETV Bharat / bharat

'వరదల్లో మా ఇల్లు మునిగిపోయింది- నా టాలెంట్​ను తల్లిదండ్రులకు చూపించలేకపోయా'- కబడ్డీ ప్లేయర్ ఆవేదన - తమిళనాడు వర్షాలు

Masanamuthu Pro Kabaddi Player Tamil Nadu Rains : ఇటీవల తమిళనాడులో వరదల బీభత్సం వల్ల తన ఇల్లు మునిగిపోయిందని ప్రొకబడ్డీ జట్టు తమిళ్​ తలైవాస్ ప్లేయర్ మసనముత్తు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి కష్ట సమయాల్లో కుటుంబానికి అండగా ఉండలేకపోయానని వాపోయాడు.

Masanamuthu Pro Kabaddi Player Tamil Nadu Rains

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 11:48 AM IST

Masanamuthu Pro Kabaddi Player Tamil Nadu Rains : ఇటీవల తమిళనాడులో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ వానల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ వరదల్లో దక్షిణ తమిళనాడులో ప్రాంతంలోని పంట పొలాలు, రోడ్లు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే వరదల వల్ల తన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని తూత్తుకూడికి చెందిన ప్రొకబడ్డీ జట్టు తమిళ్​ తలైవాస్​ ఆటగాడు మసనముత్తు తెలిపాడు. తన కుటుంబం కష్టసమయాల్లో ఉన్నప్పుడు సహాయం చేయలేకపోయానని నిస్సహాయత వ్యక్తంచేశాడు.

అయితే ప్రస్తుతం తన కుటుంబ సభ్యులు సురక్షితంగానే ఉన్నారని ఓ శిబిరంలో ఆశ్రయం పొందుతున్నారని మసనముత్తుతెలిపాడు. కానీ వరదల వల్ల తన ఇల్లు పూర్తిగా మునిగిపోయిందని, వస్తువులను కోల్పోయామని చెప్పాడు. తన ఇంటితో పాటు వర్షాల్లో చాలా ఇళ్లు కూలిపోయాయని వెల్లడించాడు. వర్షం కారణంగా తన ప్రతిభను తన తల్లిదండ్రులు, గ్రామస్థులకు చూపించలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. 'నేను కబడ్డీ ఆడటం మా తల్లిదండ్రులు, గ్రామస్థులు చూడాలనుకున్నారు. కానీ వర్షం కారణంగా వారు నేను ఆడుతున్న మ్యాచ్‌ను చూడలేకపోయారు. దాని గురించి ఆలోచిస్తే చాలా బాధగా ఉంది' అని మసనముత్తు చెప్పాడు.

ప్రొ కబడ్డీ లీగ్​ 10వ సీజన్​లో భాగంగా చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం తమిళ్​ తలైవాస్, పట్నా పైరేట్స్​ మధ్య మ్యాచ్​ జరిగింది. ఈ మ్యాచ్​లో పట్నా పైరేట్స్ గెలిచింది. కానీ మైదానం లోపల, బయట సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డ మసనముత్తు అందరికీ ప్రేరణగా నిలిచాడు.

Vishnu Vishal Twitter Post Chennai Rains : ఇటీవల తమిళనాడును అతలాకుతలం చేసిన వరదల్లో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్​ ఖాన్, కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ చిక్కుకున్నారు. కరెంట్​, సెల్​ఫోన్ సిగ్నల్స్​ లేక దాదాపు 24 గంటల పాటు చిక్కుకుపోయారు. తమకు సహాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. రెస్క్యూ బృందాలు స్పందించి సహాయక చర్యలు చేపట్టడం వల్ల చివరకు అతి కష్టం మీద బయటపడ్డారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

తమిళనాడుపై వరుణుడి ప్రకోపం- నీటమునిగిన ఇళ్లు, పొలాలు- ప్రభుత్వం అలర్ట్

తమిళనాడులో వరదల బీభత్సం- జనజీవనం అస్తవ్యస్తం,హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.