ETV Bharat / bharat

పిడుగుల బీభత్సం-28 మంది మృతి - రాజస్థాన్​లో పిడుగుపాటు

ఉత్తర్​ప్రదేశ్​, రాజస్థాన్​లలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటు కారణంగా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 28 మంది మృతిచెందారు.

lightning
పిడుగుపాటు, యూపీ, రాజస్థాన్
author img

By

Published : Jul 12, 2021, 12:21 AM IST

Updated : Jul 12, 2021, 2:00 AM IST

పిడుగుపాటుకు గురై రెండు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో 28 మంది మృతిచెందారు.

రాజస్థాన్​లోని జైపుర్, కోటా, ఝలావాడ్, ధోలాపుర్ జిల్లాల్లో 18 మంది మృతిచెందారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. 21 మందికి తీవ్రంగా గాయాలయ్యాయని పేర్కొన్నారు.

పిడుగుపాటు కారణంగా ఓ ఆవు, రెండు గేదెలు, 10 గొర్రెలు కూడా మృతిచెందాయని అధికారులు తెలిపారు.

ఎక్స్​గ్రేషియా..

మృతుల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్. మరణించినవారి ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారం ప్రకటించారు. గాయాలైనవారికీ పరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు.

యూపీలో 10 మంది

ఉత్తర్​ప్రదేశ్​లో పిడుగుపాటుకు గురై కౌశంబి, ఫతేపుర్, ఫిరోజాబాద్ జిల్లాల్లో 10 మంది మృతిచెందారు.

ఇదీ చదవండి:పిడుగుపాటుకు ఒకే కుటుంబంలో ఐదుగురు బలి

Last Updated : Jul 12, 2021, 2:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.