కేంద్ర ఆరోగ్య మంత్రి గుజరాత్‌లోని తన స్వస్థలమైన పాలిటానా గ్రామంలో పర్యటించారు. ప్రభుత్వం చేపట్టిన 'హర్ ఘర్ టీకా' కార్యక్రమంలో భాగంగా షెత్రుంజీ గ్రామంలో ఇంటింటికీ వెళ్లిన మన్సుఖ్ మాండవియా.. ప్రజలంతా టీకాలు వేయించుకోవాలని కోరారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఇంటింటికీ వెళ్లి టీకా అందించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ చర్య చేపట్టినట్లు పేర్కొన్నారు.



"ఈరోజు నేను నా స్వస్థలమైన పాలిటానాలో ఉన్నాను. ప్రధాని మోదీ పిలుపు మేరకు నా దీపావళిని షెత్రుంజీ గ్రామంలో జరుపుకుంటున్నాను. ఇక్కడి ప్రజలకు దగ్గరుండి టీకాలు వేయించా. మిగతా వారూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరా."
-మన్సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య మంత్రి
కేరళలో మరో 7వేల మందికి కరోనా..
- కేరళలో కొత్తగా 7,545 మందికి కరోనా(Kerala Corona Cases) సోకింది. మహమ్మారి ధాటికి 136 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 32,734కు పెరిగింది.
- మహరాష్ట్రలో కొత్తగా 1,141 కరోనా కేసులు వెలుగు చూశాయి. 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బంగాల్లో 918 కరోనా కేసులు నమోదయ్యయి. మరో 14మంది ప్రాణాలు కరోనాతో చనిపోయారు.
- కర్ణాటకలో 261 కొత్త కేసులు వెలుగుచూడగా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి: