MAN WOMEN BEATEN TO DEATH: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఠాణె జిల్లాలోని ఉల్హాస్‌నగర్‌లో ఓ చిన్న వివాదం హత్యకు దారితీసింది. మహిళను ఓ వ్యక్తి కొట్టి చంపేశాడు.
మృతురాలికి, నిందితుడికి లైంగిక సంబంధం ఉందని విఠల్వాడి పోలీసులు తెలిపారు. 'మార్చి 12న నిందితుడు మహిళ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇరువురికీ గొడవ జరిగింది. చిన్న విషయంపైనే ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలోనే నిందితుడు మహిళపై దాడి చేశాడు. బాధితురాలి తలను గోడకు బలంగా కొట్టాడు. దీంతో మహిళ చనిపోయింది' అని పోలీసులు వివరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితురాలి కూతురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మృతురాలి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.
Maharashtra crime news
మరోవైపు, ఠాణెలోని భీవండిలో దొంగతం ఆరోపణలతో 20 ఏళ్ల యువకుడిని కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. మంగళవారం అర్ధరాత్రి తరువాత ఈ ఘటన జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. 'బాధితురాలి తల్లి మాకు ఫిర్యాదు చేసింది. అఫ్రోజ్, ఇర్ఫాన్ ఖాన్ అనే తన కొడుకులిద్దరూ దొంగతనానికి పాల్పడ్డారని ఎవరో ఫోన్ చేసి చెప్పారని తెలిపింది. ఇర్ఫాన్ తప్పించుకోగా.. అఫ్రోజ్‌ను కొంతమంది అదుపులోకి తీసుకున్నారు. అందరూ కలిసి దాడి చేయడం వల్ల చనిపోయాడు. ఇర్ఫాన్ తల్లి ఘటనాస్థలికి చేరుకోగా.. అక్కడ తన కొడుకు మృతదేహం కనిపించింది' అని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని భీవండి పోలీసులు తెలిపారు. ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు.
ఇదీ చదవండి: ఫేస్‌బుక్‌పై సోనియా, రాహుల్ ఫైర్.. డెమొక్రసీకి డేంజర్ అంటూ..