ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: బాపూను బతికించి.. తాను కష్టాలకోర్చి..

గాంధీజీ లేని స్వాతంత్య్రోద్యమాన్ని ఊహించగలమా? ఆయన సారథ్య సామర్థ్యం గురించి అంతగా తెలియని నాడే... ప్రజలకు ఏదో చేస్తాడనే ఆశతో, దేశభక్తితో బాపూజీ ప్రాణాలు కాపాడి తాను అష్టకష్టాలు పడ్డాడో విస్మృత వీరుడు.

indian independece rare story
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​ స్టోరీ
author img

By

Published : Nov 8, 2021, 9:16 AM IST

దక్షిణాఫ్రికా నుంచి భారత్‌లో అడుగుపెట్టిన సమయాన గాంధీజీ అంతగా ఎవ్వరికీ తెలియని దశ అది. ఆయన కూడా భారత్‌ను అర్థం చేసుకుంటున్నారప్పుడప్పుడే. శుక్లా అనే బిహారీ రైతు ఒత్తిడి మేరకు చంపారన్‌ ప్రాంతానికి చేరుకున్నారు బాపూజీ. చెప్పిన మాటలు విని బ్రిటిష్‌ ప్రభుత్వంపై పోరాటం చేయటం కాకుండా... స్వయంగా రైతుల సమస్యను అర్థం చేసుకోవాలని భావించారాయన. 1917 ఏప్రిల్‌లో చంపారన్‌లో నీలిమందు (ఇండిగో) పండిస్తున్న రైతులతో మాట్లాడటానికి మోతిహారికి చేరుకున్నారు గాంధీజీ.

వస్త్రాలకు సహజ అద్దకంగా వాడే నీలిమందుకు (gandhiji in champaran movement) అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్‌ ఉన్న సమయమది. ఇందులో రైతులకు వచ్చే లాభం ఏమీ ఉండేది కాదు. పైగా ఈ పంట కారణంగా భూమి నిస్సారంగా తయారయ్యేది. కానీ భూస్వాములు, వస్త్రపరిశ్రమ యజమానులు ఒత్తిడి చేసి... రైతులతో నీలిమందు పంట తప్పనిసరిగా వేయించేవారు. అంగీకరించనివారికి రుణాలు దొరక్కుండా చేసేవారు. ఆంక్షలు విధించేవారు. పన్నులు పెంచేవారు. దీంతో రైతులు ఇష్టం లేకున్నా తప్పనిసరిగా పంట వేయాల్సి వచ్చేది. తనకు కొత్తదైన ఈ వ్యవస్థను, రైతుల అవస్థలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు గాంధీజీ.

తొలిసారి ఓ నేత వచ్చి చంపారన్‌లో పర్యటిస్తుండటంతో.. నీలిమందు వ్యాపారులు, జమీందార్లు, భూస్వాముల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో నీలిమందు ప్లాంటేషన్‌ మేనేజర్‌ ఇర్విన్‌ అనే బ్రిటిషర్‌ ఓరోజు గాంధీజీని విందుకు ఆహ్వానించాడు. అంతకుముందే ఇర్విన్‌ తన వంటమనిషి బతక్‌మియాకు ఏం చేయాలో సూచించాడు. పాలల్లో విషం కలిపి ఇవ్వాలంటూ ఆదేశించాడు. ఈ పని చేస్తే భారీగా డబ్బులిస్తానని ఆశచూపించాడు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు కూడా.

విందుకు హాజరైన గాంధీజీకి వణుక్కుంటూనే గ్లాసు ఇచ్చిన బతక్‌మియా.. విషయం అర్థమయ్యేలా హెచ్చరించారు. అక్కడే ప్రత్యక్షసాక్షిగా ఉన్న బాబూ రాజేంద్రప్రసాద్‌ బాపూజీని తీసుకొని అక్కడి నుంచి బయటపడ్డారు. అలా గాంధీజీ ప్రాణాపాయం నుంచి తప్పించుకొన్నారు. తర్వాత ఆయన సారథ్యంలో (gandhiji in champaran movement) చంపారన్‌ సత్యాగ్రహం చేయటం.. అది విజయవంతం కావటం.. రైతుల పరిస్థితిలో మార్పు రావటం.. తొలి సత్యాగ్రహంతో గాంధీజీ జాతీయ నేతగా ఎదగటం తదనంతర పరిణామాలు!

మరింతకూ.. గాంధీని చంపకుండా బతికించిన బతక్‌మియా (azadi ka amrit mahostav) పరిస్థితి ఏమైంది? చెప్పిన పని చేయనందుకు శిక్ష అనుభవించాడు బతక్‌మియా! ఆయనే కాదు యావత్‌ కుటుంబం కూడా అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పనిలోంచి ఆయన్ను తొలగించారు. చేయని తప్పులు మోపి.. జైల్లో పెట్టి నరకయాతనకు గురిచేశారు. కుటుంబాన్ని ఊరి (మోతిహారికి దగ్గర్లోని శిష్వాఅజ్గరి అనే గ్రామం) నుంచి వెళ్లగొట్టారు.. వారి ఇంటిని శ్మశానంగా మార్చారు. బతక్‌మియా గురించి అంతా మరచిపోయారు.

రాష్ట్రపతి చెప్పినా..

స్వాతంత్య్రానంతరం భారత తొలి రాష్ట్రపతి హోదాలో సొంత రాష్ట్రమైన బిహార్‌లో పర్యటించారు బాబూ రాజేంద్రప్రసాద్‌. అందులో భాగంగా మోతిహారికి వచ్చారు. రైల్వేస్టేషన్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రవేశద్వారం వద్ద ఒకవ్యక్తి ఎంతో ఆశతో తనవద్దకు రావటానికి ప్రయత్నించటం గమనించిన బాబూ రాజేంద్రప్రసాద్‌... వెంటనే ఆయన్ను బతక్‌మియాగా గుర్తుపట్టారు. తానే దగ్గరికెళ్లి పలకరించి గట్టిగా కౌగిలించుకున్నారు. సన్మాన కార్యక్రమంలో తన పక్కనే సీటులో కూర్చోబెట్టుకున్నారు. అనామకుడికి రాష్ట్రపతి ఇంత గౌరవమర్యాదలివ్వటం అందరినీ ఆశ్చర్యపరచింది. అప్పుడు ఆయనెవరో.. గాంధీజీనెలా కాపాడారో రాష్ట్రపతి వివరించారు. బతక్‌మియా కష్టాలు తెలుసుకున్న రాష్ట్రపతి.. వెంటనే వారి కుటుంబానికి 50 ఎకరాల భూమి మంజూరు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. కానీ అధికారులు బతక్‌మియా చనిపోయాక ఆరు ఎకరాలిచ్చి.. తిప్పించుకుంటున్నారని ఆ కుటుంబం వాపోయింది.

ఇదీ చదవండి:'భాజపా శక్తిని ఇంకా పూర్తిగా చూడలేదు.. త్వరలోనే...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.