ETV Bharat / bharat

నాన్​వెజ్​ లేదన్నందుకు హోటల్​ యజమానిపై కాల్పులు! - బులందర్​ శహర్​లో గన్​ఫైర్​

GUN FIRE IN UP: మాంసాహారం లేదన్నందుకు హోటల్​ యజమానిపై కాల్పులు జరిపాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బులందర్​శహర్​లో జరిగినట్లు పేర్కొన్నారు.

Man opens fire
హోటల్​ యజమానిపై కాల్పులు
author img

By

Published : Feb 28, 2022, 9:51 AM IST

GUN FIRE IN UP: ఉత్తర్​ప్రదేశ్​లోని బులందర్​శహర్​లో చౌదరివాడ ప్రాంతంలో ఉన్న డానిశ్​ హోటల్​ యజమాని అబ్దుల్ వాహిద్ పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆదివారం రోజు మాంసాహారం లేదని చెప్పినందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు. దాడిలో హోటల్​ ధ్వసం అయినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ జరిగింది..

తనకు నాన్​ వెజ్​ కావాలని ఓ వ్యక్తి వాహిద్ హోటల్​కు వచ్చాడు. నాన్​ వెజ్​ లేదని కేవలం వెజ్​ పదార్థాలు ఉన్నాయని హోటల్ సిబ్బంది ఆ వ్యక్తికి సూచించారు. కావాలంటే వాటి నుంచి ఏదైనా ఆర్డర్​ చేయాల్సిందిగా చెప్పారు. దీంతో ఆ వ్యక్తి అక్కడ నుంచి లేచి వెళ్లి కొంత సమయం తరువాత మరికొందరితో వచ్చినట్లు సిబ్బంది తెలపారు. అక్కడ ఉన్న ఆహారాన్ని తినడమే కాకుండా తూపాకీతో కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఒక బులెట్​ వాహిద్​ మేనల్లుడు అతీక్ కాలికి తగిలినట్లు పోలీసులు తెలిపారు.

అతీక్​ను చికిత్స కోసం స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్​ చేసినట్లు పేర్కొన్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:

'కొందరు నా చావు కోరుతున్నారు.. అది సంతోషమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.