ETV Bharat / bharat

స్నేహితులతో కలిసి హత్య చేసి.. మృతదేహంతో.. - బెంగళూరు వార్తలు తాజా

సోదరితో వివాహేతర సంబంధం ఉన్న కారణంగా ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు ఓ కర్ణాటకవాసి. అతడి స్నేహితులు ఇందుకు సాయం చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

karnataka bengaluru news
స్నేహితులతో కలిసి హత్య చేసి.. మృతదేహంతో..
author img

By

Published : Oct 18, 2021, 11:00 AM IST

కర్ణాటక బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరీ నగర్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉండే మునిరాజు.. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఇందుకోసం అతడి స్నేహితులు సాయం చేశారు. అనంతరం ఆ మృతదేహంతో వారందరూ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయారు.

ఇదీ జరిగింది..

ములూర్​కు చెందిన మునిరాజు సోదరికి ఇటీవల వివాహమైంది. అయితే పెళ్లికి ముందే ఆమెకు భాస్కర్​ అనే వ్యక్తితో గత రెండేళ్లగా పరిచయం ఉంది. వివాహం తర్వాత కూడా వారి బంధం కొనసాగింది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త.. భాస్కర్​తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అతను మునిరాజుకు ఫోన్​ చేశాడు. అతను తన స్నేహితులతో కలిసి ఓ ఆటోలో వచ్చి భాస్కర్​ను ఓ నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లాడు. అక్కడే భాస్కర్​ను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లి వారందరు లొంగిపోయారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర నిందితులను మారుతి, నగేశ్​, ప్రశాంత్​లుగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి : కశ్మీరేతరులపై మరో ఉగ్రదాడి- ఇద్దరు కూలీలు హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.