ETV Bharat / bharat

భార్యతో వివాహేతర సంబంధం.. యువకుడిని చంపి, 10 ముక్కలు చేసి.. - Cow calf rape in UP

24 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. అనంతరం అతడి శరీరాన్ని పది ముక్కలుగా నరికాడు. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో.. ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ దారుణం. మరోవైపు ఏడాది కాలంగా మైనర్​ కూతురిపై తండ్రి అత్యాచారం చేస్తున్నాడో తండ్రి. ఈ ఘోరం మహారాష్ట్రలో జరిగింది.

husband-murder-young-man-on-suspicion-of-his-wife-in-up
యూపీ యువకుడిని చంపి 10 ముక్కలుగా నరికిన వ్యక్తి
author img

By

Published : Jan 22, 2023, 8:11 PM IST

Updated : Jan 22, 2023, 10:06 PM IST

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో.. 24 ఏళ్ల యువకుడిని హత్య చేశాడు ఓ వ్యక్తి. అనంతరం అతని శరీరాన్ని పది ముక్కలుగా నరికాడు. వాటన్నింటిని మూడు బ్యాగుల్లో మూటగట్టి పొదల్లో పడేశాడు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. గాజియాబాద్​ జిల్లాలో నివాసం ఉంటున్న ఓ రిక్షా డ్రైవర్​ ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మిహలాల్(34)గా గుర్తించారు. ఇతడి భార్య పూనం. మిహలాల్​కు ఈమె రెండో భార్య. గత కొద్ది రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు మిహలాల్. అక్షయ్​ అనే యువకుడితో పూనం వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా భావించాడు. దీంతో అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం అక్షయ్​ను హత్య చేసి, ముక్కలుగా నరికి ఓ కాలువ పక్కన పడేశాడు. శనివారం ఈ శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీ పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

"భార్యపై అనుమానంతోనే అక్షయ్​ను చంపాడు మిహలాల్. ఇందుకు కొన్ని రోజుల క్రితమే మిహలాల్ ప్రణాళిక రచించాడు. ఓ పదునైన ఆయుదాన్ని రహస్యంగా ఇంట్లో దాచి పెట్టాడు. ఈ విషయాలన్ని నిందితుడు మా విచారణలో వెల్లడించాడు" అని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, జైలుకు పంపినట్లు వెల్లడించారు. శరీర భాగాలను పోస్ట్​మార్టం పరీక్షల నిమ్మిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

ఏడాది కాలంగా మైనర్​ కూతురిపై తండ్రి అత్యాచారం:
మైనర్​పై అత్యాచారం చేశాడో తండ్రి. కన్నకూతురనే కనికరం లేకుండా ఏడాది కాలంగా ఆమెపై ఈ దారుణానికి పాల్పడుతున్నాడు. బాలికను బెదిరించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. మహారాష్ట్రలో ఈ ఘోరం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడికి 37 ఏళ్ల వయస్సు. ఇతడు భార్య, కూతురితో కలిసి నాగ్​పుర్​లోని వథోడా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. భార్య పనికెళ్లిన సమయంలో కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టేవాడు. విషయం ఎవరికైన చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆమెను బెదిరించేవాడు. దీంతో భయపడ్డ బాలిక.. ఘటనను ఎవరికీ చెప్పలేదు. కొద్ది రోజులుగా తండ్రి ఆగడాలు మితిమీరిపోవడంతో.. విషయాన్ని తల్లికి తెలిపింది బాధితురాలు. అనంతరం ఘటనను పోలీసులకు చేరవేసింది బాలిక తల్లి. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతనిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

ఆవు దూడపై అత్యాచారం:
రెండేళ్ల ఆవు దూడపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. ఉత్తర్​ప్రదేశ్​లోని షాజహాన్‌పుర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. 35 ఏళ్ల రామ్​ప్రసాద్​ అనే వ్యక్తి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. సెహ్రమౌలోని చాన్‌పుర్ గ్రామంలో నివాసం ఉండే ధారా సింగ్​కు చెందిన ఆవు దూడపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు.. అతడిని పోలీసులకు అప్పగించారు.

Last Updated : Jan 22, 2023, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.