ETV Bharat / bharat

అన్నం వండలేదని భార్యను ఇటుకతో కొట్టి హత్య.. 'ఆమె'పై కోపంతో ఉరేసుకున్న భర్త! - గుజరాత్​ వార్తలు

డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి అన్నం వండలేదని ఇటుకతో కొట్టి భార్యను హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన ఒడిశాలో జరిగింది. మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లో భార్యపై కోపంతో ఓ భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

crime news
crime news
author img

By

Published : May 10, 2023, 9:44 AM IST

Updated : May 10, 2023, 1:04 PM IST

అన్నం వండలేదని ఓ వ్యక్తి.. తన భార్యను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని సంబల్​పుర్​ జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని నుధి గ్రామంలో నిందితుడు సనతాన్​ ధరువా(40).. తన భార్య పుష్ప(35), పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి పనులు ముగించుకుని సనాతన్​ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పుష్ప.. కేవలం కూర వండి అన్నం వండలేదు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహంతో సనాతన్​.. ఇటుకతో తన భార్యపై దాడి చేసి చంపేశాడు.

స్నేహితుడి ఇంటికి వెళ్లిన మృతురాలి కుమారుడు.. ఇంటికి వచ్చి చూడగా తల్లి విగతజీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పుష్ప మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అబ్బాయి పుట్టలేదని భార్య హత్య
ఉత్తర్​ప్రదేశ్​లోని తాజ్​నగరి జిల్లాలో ఓ వ్యక్తి.. తన భార్యకు అబ్బాయి పుట్టలేదని హత్య చేశాడు. ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని ఆగ్రహంతో అతడు.. ఆమెను గొంతు నులిమి చంపేశాడు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జిల్లాలో సౌదాగర్ లైన్ ప్రాంతంలో ఉంటున్న నిందితుడు భవానీ సింగ్‌కు అలీగఢ్​లోని రాయ్‌పుర్-మణిపుర్ గ్రామానికి చెందిన అమలేష్‌తో 2015లో వివాహం జరిగింది. భవానీ సింగ్ ఆ ప్రాంతంలోనే టీ దుకాణం నడుపుతున్నాడు. వీరి వివాహానికి గుర్తుగా అమలేష్​కు ముగ్గురు కుమార్తెలు పట్టారు. మూడో కుమార్తె ఇటీవలే చనిపోయింది. ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని భవానీసింగ్​ ఎప్పుడూ దుర్భాషలాడేవాడు.

సోమవారం అర్థరాత్రి భార్యాభర్తల మధ్య ఇదే విషయమై వాగ్వాదం జరిగింది. ఆ గొడవలోనే భవానీ సింగ్.. అమలేష్ గొంతు నులిమి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం తరలించారు. ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు, మృతురాలి బంధువుల వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసి నిందితుడైన భవానీ సింగ్‌ను అరెస్టు చేశారు పోలీసులు.

భార్యపై కోపంతో భర్త సూసైడ్​
ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకీ జిల్లాలో భార్యపై కోపంతో ఓ భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని లాల్‌పూర్ మజ్రే ఇబ్రహీంబాద్‌కు చెందిన రవిశంకర్ (25).. గతేడాది మే 11న వైస్‌పుర్ నివాసి మనీషాను వివాహం చేసుకున్నాడు. రవిశంకర్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అయితే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. మంగళవారం మధ్యాహ్నం కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఆగ్రహించిన మనీషా.. ఇటుకతో భర్తపై దాడి చేసింది. ఆ తర్వాత ఆమెపై కోపంతో ఇంట్లో ఉరివేసుకుని మరణించాడు రవిశంకర్​. సమాచారం అందుకున్న పోలీసులు రవిశంకర్​ మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని శవపరీక్షల కోసం స్థానికంగా ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

సోదరి బట్టలపై రక్తపు మరకలను చూసి హత్య
సోదరి బట్టలపై రక్తపు మరకలను చూసి అనుమానం పెంచుకుని ఆమెను విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు ఓ సోదరుడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్​ప్రదేశ్​లోని బదోహి జిల్లాకు చెందిన మృతురాలు.. తన తల్లి చనిపోవడం వల్ల మహారాష్ట్ర వచ్చేసింది. ఉల్హాస్​ నగర్​లో తన సోదరుడి దగ్గర ఉంటోంది. ఇటీవలే ఆమె రజస్వల అయింది. దానిపై ఆమెకు అవగాహన లేదు. దీంతో రుతుక్రమం కావడం వల్ల రక్తస్రావమై ఆమె బట్టలు తడిసిపోయాయి.

అయితే ఈ మరకలను చూసిన ఆమె వదిన.. తన భర్తకు తప్పుడు సమాచారం అందించింది. మృతురాలికి ప్రేమ వ్యవహారం ఉందని, లైంగిక సంపర్కం వల్లే ఈ రక్తస్రావం జరిగిందని చెప్పింది. దీంతో సోదరిని అనుమానించి.. ఆమెను దారుణంగా కొట్టాడు. వెంటనే ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉల్హాస్‌నగర్ సెంట్రల్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితుడైన సోదరుడిని అరెస్ట్ చేశారు.

సింహం, చిరుతకు చిన్నారులు బలి
గుజరాత్​లోని ఆమ్రేలీ జిల్లాలో ఇద్దరు చిన్నారులు.. క్రూర జంతువులకు బలయ్యారు. ఐదు నెలల చిన్నారిని సింహం చంపేయగా.. మూడేళ్ల బాలుడిని చిరుత హతమార్చింది. ఈ ఘటనలపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు మెగా ఆపరేషన్​ను నిర్వహించి.. సింహం, చిరుతను బంధించారు. జంతుసంరక్షణ కేంద్రాలకు తరలించారు.

Last Updated : May 10, 2023, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.