ETV Bharat / bharat

12వ భార్యను కొట్టి చంపిన భర్త.. అంతకుముందు 11 మంది అలా.. - minor girl gangrape in jharkahnd

ఝార్ఖండ్​లో దారుణం జరిగింది. తన 12వ భార్యను కర్రతో దారుణంగా కొట్టి చంపాడు ఓ వ్యక్తి. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డాడు నిందితుడు.

man-killed-12th-wife-in-jharkahnd-husband-murdered-wife
ఝార్ఖండ్‌లో భార్యను హత్య చేసిన భర్త
author img

By

Published : Apr 3, 2023, 3:35 PM IST

Updated : Apr 3, 2023, 4:33 PM IST

తన 12వ భార్యను దారుణంగా కొట్టి చంపాడు ఓ వ్యక్తి. మద్యం మత్తులో.. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమె.. అక్కడికక్కడే మృతి చెందింది. ఝార్ఖండ్​లోని గిరిడీ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఆదివారం రాత్రి ఘటన జరిగినట్లు పోలీసుల తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గయాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామ్‌దార్ పంచాయితీ పరిధిలోని తారాపుర్ గ్రామానికి చెందిన రామచంద్ర, సావిత్రి దేవి భార్యభర్తలు. ఆదివారం రాత్రి.. రామచంద్ర ఇంట్లో మద్యం తాగుతున్నాడు. అదే సమయంలో భార్య సావిత్రి దేవితో, రామచంద్రకు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన రామచంద్ర.. భార్యపై కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ సావిత్రి దేవి.. అక్కడికక్కడే మృతి చెందింది. సోమవారం ఉదయం ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. సావిత్రి దేవి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

"నిందితుడు రామచంద్రకు ఇప్పటి వరకు 12 పెళ్లిళ్లు అయ్యాయి. సావిత్రి దేవి 12వ భార్య. సావిత్రికి ఇది వరకే పెళ్లైంది. రామచంద్రతో గొడవ పెట్టుకుని మిగతా 11 మంది భార్యలు.. అతడ్ని విడిచిపెట్టి వెళ్లారు. రామచంద్రకు పిల్లలెవ్వరూ లేరు. కానీ సావిత్రి దేవికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు." అని గ్రామస్థులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కొండపై నుంచి భార్యను తోసేసిన భర్త..
భార్యను కొండ మీది నుంచి తోసి.. హత్య చేసే ప్రయత్నం చేశాడు ఓ భర్త. సెల్ఫీ తీసుకుందామని ఆమెను కొండపైకి తీసుకెళ్లి, అనంతరం కొట్టి.. కిందకు తోసేశాడు. చనిపోయిందని భావించి అక్కడి నుంచి పారిపోయాడు. బిహార్​లోని జాముయ్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

నిషా కుమారి, రాజ్​ రంజన్​.. 2019లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు బెగుసరాయ్‌.. సాహెబ్‌పుర్ కమల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తర్​బన్నా గ్రామంలో నివాసం ఉంటున్నారు. శనివారం వీరు ఓ కొత్త కారు కొన్నారు. ఇద్దరు కలిసి కారుకు పూజ చేయించేందుకు ఆదివారం ఉదయం గుడికి బయలుదేరారు. జాముయ్​-దేవ్​ఘర్ ప్రధాన రహదారి పక్కనున్న బాటియా లోయ వద్ద రాజ్​ రంజన్ కారు ఆపాడు. పక్కనున్న కొండపైకి వెళ్లి సెల్ఫీ తీసుకుందామని భార్యకు చెప్పాడు. ఇద్దరు కలిసి పైకి వెళ్లారు. సెల్ఫీ నెపంతో భార్యను రాళ్లతో కొట్టి కిందకు తోసేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

"నాకు మత్తు మందు కలిపిన చిప్స్​ తినిపించాడు. దాంతో నేను కొంచెం మత్తులోకి వెళ్లాను. నన్ను రాళ్లతో కొట్టాడు. కొండపై నుంచి కిందకు తోసేశాడు. దీంతో నాకు తీవ్ర గాయాలు అయ్యాయి. కింద పడ్డ మూడు గంటల తరువాత నాకు మెలకువ వచ్చింది. అనంతరం రోడ్డుపైకి వచ్చాను. ఓ వ్యక్తి సాయంతో ఆసుపత్రిలో చేరాను." అని బాధితురాలు తెలిపింది.

బాలికపై సామూహిక అత్యాచారం..
స్నేహితులతో కలిసి గుడికి వెళుతున్న బాలికపై అత్యాచారం చేశారు ఇద్దరు వ్యక్తులు. ఆమె స్నేహితులను బెదిరించి, వారిని అక్కడి నుంచి తరిమేసి, బాలికను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఝార్ఖండ్​లోని రామ్‌ఘర్ జిల్లాలో ఘటన జరిగింది. ఘటన అనంతరం బాలిక నేరుగా పోలీస్​ స్టేషన్​కు వెళ్లింది. జరిగింతంతా పోలీసులకు చెప్పింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించారు. నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. మరొకడు పరారీలో ఉన్నాడు.

Last Updated : Apr 3, 2023, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.