ETV Bharat / bharat

వైద్యుడి అద్భుతం.. 54 ఏళ్ల తర్వాత కంటి చూపు పొందిన వ్యక్తి! - భట్టాచార్య 54 ఏళ్ల తర్వాత చూపు

Eye Vision after 54 years of Birth: బంగాల్​కు చెందిన ఓ వ్యక్తికి జరిగిన అసాధారణ కంటి వైద్య చికిత్స విజయవంతమైంది. పుట్టుకతోనే కుడి కంటి చూపు కోల్పోయిన జర్నలిస్టు పార్థ భట్టాచార్య.. 54 ఏళ్ల తర్వాత తిరిగి చూపును పొందారు. ప్రస్తుతం తాను కుడి కన్నుతో స్పష్టంగా చూడగలుగుతున్నానని, చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

Man gets back his vision after 54 years
పేపరు చదువుతున్న భట్టాచార్య
author img

By

Published : Jun 1, 2022, 12:56 PM IST

Updated : Jun 1, 2022, 1:29 PM IST

Eye Vision after 54 years of Birth: సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటారు పెద్దలు. అంటే అన్ని అవయవాల కంటే కళ్లు ముఖ్యమైనవని అర్థం. కానీ, దేశంలో చాలా మంది పుట్టుకతో చూపు కోల్పోయి జీవనాన్ని సాగిస్తుంటారు. కొందరు కేవలం ఒక కంటితోనే చూడగలుగుతారు. అయితే ఆ కోవకే చెందిన బంగాల్​లోని ఓ వ్యక్తి.. 54 ఏళ్ల తర్వాత కుడి కంటి చూపును పొందారు.

Man gets back his vision after 54 years
కుటుంబసభ్యులతో భట్టాచార్య

జల్పాయ్​గుడి జిల్లా రైకత్​పరా నివాసి అయిన పార్థ భట్టాచార్య వృత్తిరీత్యా జర్నలిస్టు. ఆయన 7వ తరగతిలో ఉన్నప్పుడు కుడి కన్ను సమస్య ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పారు. వారు భట్టాచార్యను స్థానిక కంటి వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. అయితే డాక్టర్​.. కుడి కంటితో పూర్తిగా చూడలేరని తెలిపాడు. భట్టాచార్య పేద కుటుంబానికి చెందినవారు. కరెంట్ మీటరు పెట్టించుకునే స్తోమత లేకపోవడం వల్ల నూనె దీపాల సహాయంతోనే చదువుకునేవారు. దీంతో తక్కువ వెలుతురులో చదవడం వల్ల ఆయన కంటి సమస్య మరింత ఎక్కువైంది.

Man gets back his vision after 54 years
భట్టాచార్యకు వైద్య పరీక్షలు జరుపుతున్న వైద్యుడు

అప్పటి నుంచి భట్టాచార్య దేశవ్యాప్తంగా పలువురు వైద్యులను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స కోసం నేపాల్‌కు కూడా వెళ్లారు. అయితే మే 5న శిలిగుడిలోని గ్రేటర్ లయన్స్ ఆసుపత్రికి వెళ్లి నేత్ర వైద్య నిపుణుడు క్వాజీ ఆలం నయ్యర్‌ను కలిశారు. ఆపరేషన్​ చేస్తే చూపు వచ్చే అవకాశం ఉందని తెలిపిన వైద్యుడు నయ్యర్​.. వెంటనే శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్​ విజయవంతమై చూపును పొందారు భట్టాచార్య.

Man gets back his vision after 54 years
పేపరు చదువుతున్న భట్టాచార్య

"నేను దేశంలో వివిధ ఆసుపత్రులను సంప్రదించాను. అందరు డాక్టర్లు చూపు తిరిగి పొందడం కష్టమని చెప్పారు. అయితే ఒకరు చెప్పడం వల్ల గ్రేటర్​ లయన్స్​ ఆసుపత్రికి వెళ్లాను. చాలాసేపు వివిధ కంటి పరీక్షలు జరిపిన డాక్టర్ ఖ్వాజీ ఆలం నయ్యర్​​.. ఆపరేషన్ చేయడం వల్ల నాకు కంటి చూపు తిరిగి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వెంటనే ఆయన ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం నా కుడి కన్నుతో నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది" అని భట్టాచార్య చెప్పారు.

ఇవీ చదవండి: శరవేగంగా అయోధ్య రామాలయం.. 'గర్భగుడి' నిర్మాణానికి యోగి శంకుస్థాపన

పీఎం జీవన్‌జ్యోతి, సురక్ష బీమా.. వార్షిక ప్రీమియం పెంపు

Last Updated : Jun 1, 2022, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.