ETV Bharat / bharat

'బాలికపై అత్యాచారం- మత మార్పిడికి బలవంతం!' - యూపీ వార్తలు

ఉత్తర్​ప్రదేశ్​లో మైనర్​పై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఓ యువకుణ్ని అరెస్ట్​ చేశారు పోలీసులు. ఈ ఘటనలో ఆమెను మత మార్పిడికి బలవంతం చేసినట్టు తెలుస్తోంది.

Man arrested for raping teenage girl, putting pressure on her to change religion in UP
యూపీలో మైనర్​పై అత్యాచారం
author img

By

Published : Mar 16, 2021, 3:48 PM IST

యూపీలో గతవారం జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. అత్యాచారం అనంతరం.. మతం మార్చుకోవాలంటూ సదరు బాలికపై అతడు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ ఘటనకు కారకుడైన నిందితుణ్ని అరెస్ట్​ చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఇదీ జరిగింది..

ఫతేపుర్​లోని లాలౌలీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో శుక్రవారం(ఈ నెల 12న) రాత్రి.. రాజు అన్సారీ(23) ఓ బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శనివారం ఉదయం ఆమెను రాజు ఇంట్లో గుర్తించారు. ఈ ఘటనలో బాధితురాలిని మతం మార్చుకోవాలని నిందితుడు బలవంతం చేశాడని పోలీసులు వెల్లడించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అన్సారీని సోమవారం సాయంత్రం అరెస్ట్​ చేశారు పోలీసులు. అతడిపై భారతీయ శిక్షాస్మృతి, యూపీలోని బలవంతపు మత మార్పిడి నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: కొండచిలువను వేటాడిన పులి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.