ETV Bharat / bharat

కట్నం తేనందని భార్యతో యాసిడ్ తాగించిన భర్త! - భార్యకు యాసిడ్ తాగించిన భర్త అరెస్ట్​

అదనపు కట్నం తెచ్చేందుకు నిరాకరించిందని.. భార్యతో బలవంతంగా యాసిడ్ తాగించాడు అమె భర్త. మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో ఈ దారుణం జరిగింది. బాధితురాలు ప్రస్తుతం దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇంతటి కిరాతకానికి ఒడిగట్టిన ఆమె భర్తను పోలీసులు అరెస్ట్​ చేశారు.

Dowry cruelty
వరకట్న వేధింపులు
author img

By

Published : Jul 22, 2021, 1:30 PM IST

అదనపు కట్నం కోసం భార్య పట్ల క్రూరంగా ప్రపర్తించి.. బలవంతగా యాసిడ్​ తాగించాడు అమె భర్త. మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో జరిగిందీ దారుణ ఘటన. ఈ క్రూరత్వాన్ని ఒడిగట్టిన ఆ వ్యక్తిని.. పోలీసులు అరెస్ట్​ చేశారు.

అసలేమైందంటే..

'మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లోని దబ్రాకు చెందిన వీరేంద్ర కుమార్​కు.. శశి అనే యువతితో ఈ ఏడాది ఏప్రిల్​ 17న పెళ్లైంది. యువతి తల్లిదండ్రులు రూ.10 లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా వివాహం జరిపించారు. అయితే వీరేంద్ర కుమార్ కారు కొనేందుకు.. రూ.3 లక్షల అదనపు కట్నం తీసుకురావాలని భార్యను ఇటీవల వేధించసాగాడు. అదనపు కట్నం గురించి తల్లి దండ్రులతో మాట్లాడేందుకు శశి నిరాకరించింది. దీనితో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. వీరేంద్ర కుమార్​ భార్యను కిందకు తోసి.. బలవంతంగా యాసిడ్​ తాగించాడు. దీనితో ఆమె ఆరోగ్య క్షీణించింది' అని పోలీసులు తెలిపారు.

యాసిడ్​ వల్ల శరీరంలో పలు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. మెరుగైన వైద్యం కోసం దిల్లీ ఆస్పత్రికి అమెను తరలించినట్లు స్థానిక వైద్యులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వీరేంద్ర కూమార్​పై కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీ చదవండి:viral video: నమస్తే పెట్టలేదని కర్రలతో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.