ETV Bharat / bharat

సీతల్​కుచి కాల్పులు: మమత ఆడియో కలకలం! - mamta benarjee audio leak

బంగాల్​లో ఐదో విడత పోలింగ్​కు ముందు భాజపా విడుదల చేసిన ఓ ఆడియో.. వివాదాస్పదంగా మారింది. సీతల్​కుచి కాల్పుల ఘటనలో మరణించిన వారి నలుగురి మృతదేహాలతో ర్యాలీలు నిర్వహించాలని టీఎంసీ అభ్యర్థితో​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పడం ఇందులో వినిపించింది. అయితే.. టీఎంసీ దీన్ని ఖండించింది. ఇదంతా బూటకం అని పేర్కొంది.

mamata benarjee
మమతా బెనర్జీ ఫోన్​ కాల్​!
author img

By

Published : Apr 17, 2021, 4:51 AM IST

Updated : Apr 17, 2021, 5:22 AM IST

సీతల్​కుచిలో కాల్పుల ఘటనకు సంబంధించి భాజపా విడుదల చేసిన ఓ ఫోన్​ కాల్​ ఆడియో కలకలం రేపుతోంది. కాల్పుల్లో మృతి చెందిన నలుగురి మృతదేహాలతో ర్యాలీలు నిర్వహించాలని సీతల్​కుచి తృణమూల్​ అభ్యర్థికి మమతా బెనర్జీ చెప్పడం.. ఇందులో వినిపించింది.

సీతల్​కుచి టీఎంసీ అభ్యర్థి పార్థ ప్రతిమ్​ రాయ్​, మమతా బెనర్జీకి మధ్య సంభాషణ జరిగినట్లు ఉన్న ఈ ఆడియోను భాజపా ఐటీ విభాగం చీఫ్​ అమిత్​ మాల్వియా విడుదల చేశారు. మృతదేహాలతో ర్యాలీలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు సూచించడం ద్వారా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్లర్లకు ప్రేరేపించారని మాల్వియా ఆరోపించారు.

రాబందుల సంస్కృతిని బంగాల్​లో​ అధికార పార్టీ అనుసరిస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్​ వేదికగా విమర్శించారు.

"రాజకీయ లబ్ధి కోసం మృతదేహాల మీద పడి దోచుకు తినే రాబందుల సంస్కృతిని టీఎంసీ అనుసరిస్తోంది. ఇందుకు టీఎంసీ సిగ్గుపడాలి."

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

ఈ ఆడియో క్లిప్​ను ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు భాజపా వెళ్లనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

'ఇదంతా బూటకం'

అయితే.. టీఎంసీ అభ్యర్థి పార్థ ప్రతిమ్​ రాయ్​ దీన్ని ఖండించారు. ఇదంతా బూటకం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకీ, తనకు మధ్య ఇలాంటి సంభాషణ జరగలేదు అని చెప్పారు.

బంగాల్​లో నాలుగో విడత పోలింగ్​ సందర్భంగా.. సీఐఎస్​ఎఫ్​ బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.

ఇదీ చూడండి:'బంగాల్​లో బలగాలపై దాడి దీదీ పనే'

ఇదీ చూడండి:పోలింగ్​ బూత్​ ముందే కాల్పులు- తొలి ఓటరు మృతి

Last Updated : Apr 17, 2021, 5:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.