ETV Bharat / bharat

'ఆ కుటుంబం అసలు రంగును గుర్తించలేకపోయా' - పూర్వ మేద్నిపుర్​ ఎన్నికల ప్రచారంలో మమతా

సువేందు అధికారి కుటుంబం అసలు రంగును గుర్తించలేకపోయానని తనన తానే నిందించుకున్నారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. డబ్బుతో ఓట్లను అధికారి కుటుంబం కొనుగోలు చేస్తుందని ఆరోపించారు. జమీందార్ల తరహాలో తూర్పు మెదినీపుర్​ జిల్లాను హస్తగతం చేసుకుందని విమర్శించారు.

Mamata blames self for not recognising true face of Adhikari family
'ఆ కుటుంబపు అసలు ముఖాన్ని గుర్తించలేకపోయా'
author img

By

Published : Mar 21, 2021, 4:06 PM IST

బంగాల్​ ముఖ్యమంత్రి, తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ తనను తానే నిందించుకున్నారు. అధికారి కుటుంబం అసలు రంగును గుర్తించడంలో విఫలమయ్యానని అన్నారు. తూర్పు మెదినీపుర్​ జిల్లా కాంతిదక్షిణ్​లో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు.

రూ.5,000 కోట్లు విలువైన ఓ సామ్రాజ్యాన్ని అధికారి కుటుంబం నిర్మించిందనే వదంతులను కూడా తాను విన్నానని మమత అన్నారు. తాను మరోసారి అధికారంలోకి వచ్చాక ఆ వ్యవహారంపై దర్యాప్తు చేయిస్తానని చెప్పారు. అధికారి కుటుంబ సభ్యుల్ని నమ్మకద్రోహులుగా అభివర్ణించారు.

" వాళ్ల అసలు రంగును గుర్తించలేకపోయినందుకు నేనో అసమర్థురాలిని. ఆ కుటుంబానికి రూ.5,000 కోట్లతో ఓ సామ్రాజ్యం ఉందని చాలా మంది అంటూ ఉంటారు. కానీ, నాకు దాని గురించి తెలియదు. వాళ్లు డబ్బులతో ఓట్లను కొనుగోలు చేస్తారు. కానీ, వారికి మీరు ఓటు వేయకండి. "

-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

ఇటీవలే తృణమూల్​ను వీడిన భాజపాలో చేరిన సువేందు అధికారి.. నందిగ్రామ్​లో మమతకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారి కుటుంబంపై మమత ఈ విమర్శలు చేశారు.

"భాజపా.. రౌడీలు, గుండాల పార్టీ" అని మమత విమర్శించారు. జమీందార్ల తరహాలో జిల్లా మొత్తాన్ని అధికారి కుటుంబం తమ అధీనంలోకి తెచ్చుకుందని ఆరోపించారు. తనను ఈ ప్రాంతంలో ప్రచారానికి కూడా అనుమతించటం లేదని అన్నారు.

ఇదీ చూడండి:'బంగాల్​ ఎన్నికల్లో నెగ్గాక.. దిల్లీలో మార్పు తెస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.