ETV Bharat / bharat

Onam 2021: ఘనంగా ఓనమ్​.. ప్రధాని, రాష్ట్రపతి శుభాకాంక్షలు - ఘనంగా ఓనమ్​ వేడుకలు

మలయాళీల నూతన సంవత్సరం-ఓనమ్​ పండుగను(Onam 2021) ఘనంగా జరుపుకొంటున్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు చేసుకుంటున్నారు. చిన్నారులు వివిధ వేషధారణలో మురిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శుభాకాంక్షలు తెలిపారు.

Kerala celebrates Onam
ఓనమ్​ పండుగ ఎంతో సంబరంగా..
author img

By

Published : Aug 21, 2021, 12:04 PM IST

Updated : Aug 21, 2021, 1:02 PM IST

కేరళలో ఓనమ్​ పండుగను(Onam 2021) ఘనంగా జరుపుకొంటున్నారు మలయాళీలు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు చేసుకుంటున్నారు. చిన్నాపెద్ద అంతా సంప్రదాయ దుస్తులు ధరించి కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Kerala celebrates Onam
ఆలయానికి వెళ్తున్న యువతులు
Kerala celebrates Onam
అనంతపద్మనాభ స్వామి ఆలయం
Kerala celebrates Onam
అనంత పద్మనాభ స్వామి ఆలయంలో

కోయంబత్తూర్​లోని శ్రీ అయ్యప్ప ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. అయితే.. కొవిడ్​ ఆంక్షల నేపథ్యంలో గుడిలోపలికి ఎవరినీ అనుమతించలేదు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

ఓనమ్​ పండుగను(Onam Festival) పురస్కరించుకుని మలయాళీలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 'ఈ పండుగ సానుకూలత, చైతన్యం, సోదరభావం, సామరస్యంతో ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నా' అని మోదీ ట్వీట్​ చేశారు.

PM Modi
మోదీ ట్వీట్​

'ప్రజలందరికీ ఓనమ్​ పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ కొత్త పంటల వేడుక. రైతుల నిర్వరామ కృషికి నిదర్శనం. మాతృభూమి స్వభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప సందర్భం. ప్రజలందరూ సంతోషం, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి.' అని ట్వీట్​ చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.

శశిథరూర్​ ఇంట్లో ఓనమ్​..

కేరళల పాలక్కడ్​లోని ఇంటిలో.. కుటుంబ సభ్యులతో కలిసి ఓనమ్​ ఉత్సవాలు ఘనంగా జరుపుకొన్నారు కాంగ్రెస్​ ఎంపీ శశిథరూర్. సంప్రదాయ దుస్తులు ధరించి ఊయల ఊగుతున్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు. ప్రజలకు ఓనమ్​ శుభాకాంక్షలు చెప్పారు. ​

  • There’s an Onam swing tradition that one normally leaves to young girls. I was persuaded to get Into the spirit of things this year. Happy Onam! pic.twitter.com/Z23nJ9Fmfp

    — Shashi Tharoor (@ShashiTharoor) August 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

10 రోజుల పాటు..

మలయాళీల నూతన సంవత్సరం ఓనమ్​ పండుగ. మలయాళం క్యాలెండర్​ ప్రకారం చింగమ్​ నెలలో 22వ నక్షత్ర తిరువోనమ్​ ప్రకారం తేదీని నిర్ణయిస్తారు. ఆగస్టు-సెప్టెంబర్​ మధ్య వస్తుంది. ఈ ఉత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి. తిరువోనమ్​తో పూర్తవుతాయి.

వర్చువల్​గా..

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఓనమ్​ ఉత్సవాలను వర్చువల్​గా నిర్వహించాలని నిర్ణయించింది కేరళ ప్రభుత్వం. ఆగస్టు 14న వర్చువల్​ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఇదీ చూడండి: ఓనమ్​ వేడుకల్లో అలనాటి 'కుమ్మత్తికాళి' కళకళలు

Last Updated : Aug 21, 2021, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.