మహారాష్ట్ర రత్నగిరిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లోట్ ఎంఐడీసీ(మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ప్రాంతంలోని ఓ రసాయన కంపెనీలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో ఎనిమిది మంది క్షతగాత్రులయ్యారు. వీరు సమీప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తొలుత పేలుడు సంభవించడం వల్లే.. మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సుమారు రెండు గంటలపాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు.
ఇదీ చదవండి: ఆ రాష్ట్రాలకు వెళ్తే.. ఈ ఆంక్షలు పాటించాల్సిందే!