వేలుకు బిగుసుకున్న ఉంగరాన్ని తీయడానికి ఓ బాలుడికి మూడు శస్త్రచికిత్సలు జరిగాయంటే నమ్మశక్యంగా లేదు కదూ! కానీ మహారాష్ట్రలో ఓ ఆసుపత్రి చేసిన నిర్వాకానికి 14 ఏళ్ల బాలుడికి మూడు సర్జరీలు అయ్యాయి.

ఇదీ జరిగింది..
ఠాణెకు చెందిన పార్థ సతీష్ టోప్లే(14) వేలుకు ఉంగరం బిగుసుకుంది. దానిని తీయడానికి టోప్లే తల్లి అతడ్ని లేక్ సిటీ ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆ సయమంలో టోప్లేను సీనియర్ వైద్యులు కాకుండా ఆసుపత్రి అసిస్టెంట్ పరీక్షించి ఇంటికి పంపించాడు. వారు ఇంటికి వెళ్లిన తర్వాత ఉంగరం తీయడానికి తను ఇంటికి వస్తున్నానని టోప్లే కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. ఆసుపత్రి యాజమాన్యమే పంపించిందని నమ్మబలికాడు. ఉంగరం తీసే క్రమంలో బాలుని వేలు కత్తిరించాడు.

బాధితులు ఆసుపత్రికి ఫిర్యాదు చేయగా.. వేలును అతికిస్తామని చెప్పారు వైద్యులు. అందుకు కాస్త సమయం పడుతుందని.. సర్జరీ చేసి కడుపులో వేలు దాచారు. మరో నెల తర్వాత మళ్లీ సర్జరీ చేసి కడుపులో వేలును చేతికి అతికించారు. వరుసగా మూడు సర్జరీలు చేసేసరికి బాలుని ఆరోగ్యం విషమంగా మారింది. సర్జరీలకు ఆ కుటుంబానికి చాలా డబ్బు ఖర్చయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబ సభ్యులు. ఆసుపత్రికి గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: వాళ్లతో మాట్లాడిందని మహిళను చితకబాదిన కుటుంబసభ్యులు