ETV Bharat / bharat

భార్య, ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య.. కారణం అదేనా? - భార్య, ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య

Maharashtra Family Suicide: భార్య, ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Nagpur man ends life after killing wife, 2 children
భార్య, ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య
author img

By

Published : Jan 19, 2022, 5:42 AM IST

Updated : Jan 19, 2022, 8:58 AM IST

Maharashtra Family Suicide: మహారాష్ట్రలోని నాగ్​పుర్​ జిల్లా జరిపట్కాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. తన భార్యాపిల్లల్ని చంపి చివరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఏం జరిగిందంటే..?

నాగ్​పుర్ జిల్లా జరిపట్కాలో ఉండే మదన్ అగర్వాల్​కు (33) భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అగర్వాల్​ దయానంద్​ పార్క్​ వద్ద ఓ ఫుడ్​ స్టాల్ నిర్వహిస్తున్నాడు. బ్యాంకు వద్ద తీసుకున్న రుణం చెల్లించనందున ఇటీవల బ్యాంకు.. అగర్వాల్ ఇంటిని జప్తు చేసింది. దీంతో జరిపట్కా ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాడు. అయితే.. మంగళవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో.. అగర్వాల్ స్నేహితుడు ఇంటికి వెళ్లి తలుపు కొట్టగా ఎవ్వరూ తీయలేదు.

Maharashtra Family Suicide
సతీమణితో మదన్ అగర్వాల్

దీంతో అనుమానం వచ్చి.. తలుపులు పగులగొట్టి చూడగా.. ఇద్దరు పిల్లలు, అగర్వాల్ భార్య రక్తపు మడుగులో పడిఉన్నారు. అగర్వాల్ మృతదేహం ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించింది. వెంటనే సదరు వ్యక్తి.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఈ ఘటన సోమవారం రాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున జరిగిఉండవచ్చని అనుమానిస్తున్నారు.

అగర్వాల్ మొదట భార్య పిల్లల్ని చంపి.. తర్వాత తానూ ఉరివేసుకున్నట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో సూసైడ్ నోట్​ లభించలేదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సీఎం భద్రతా సిబ్బంది డ్రగ్స్ దందా- ఇద్దరు అరెస్ట్

Last Updated : Jan 19, 2022, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.