మహారాష్ట్రలో జరిగిన ఓ పుట్టిన రోజు వేడుక తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నాసిక్ జిల్లాలోని ఇగత్‌పురిలో జరిగిన ఈ వేడుకలో నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు నీట మునిగి మృతిచెందారు. శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది.
ఇదీ జరిగింది..
వాదివర్హే గ్రామానికి చెందిన సోనీగేమ్(12) పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు.. తొమ్మిది మంది మిత్రులు(దాదాపు అందరూ మైనర్లే) వాల్దేవీ ఆనకట్ట వద్దకు వెళ్లారు. అందరూ కలిసి డ్యామ్‌పై నిల్చుని ఫొటో తీసుకునేందుకు యత్నించగా.. వారిలో కొందరు నీటిలో పడిపోయారు. నీట మునిగిన వారిలో సోనీగేమ్ మృతదేహాన్ని వెంటనే వెలికి తీయగా.. శనివారం ఉదయం నాటికి మిగిలిన ఐదుగురి శవాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం వాటిని నాసిక్ జిల్లా సివిల్ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.
ఇదీ చదవండి: 'ఆక్సిజన్' కొరతతో నలుగురు కరోనా రోగులు మృతి