దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో అలాంటి అమానుష ఘటనే జరిగింది. అత్యాచారం కేసులో బెయిల్‌పై వచ్చిన ఓ దుండగుడు మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. నిందితుడు ఆదేశ్ పటేల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. 10 రోజుల క్రితమే ఓ అత్యాచారం కేసులో బెయిల్ పొంది బయటకు వచ్చినట్లు తెలపటం గమనార్హం. ఈ ఘటన రాయ్‌గఢ్ జిల్లా, పెన్ తహసీల్, వడ్గావ్ గ్రామంలో బుధవారం(డిసెంబర్30న) జరిగింది.
"బుధవారం(డిసెంబర్30) తన తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న చిన్నారిని ఆదేశ్ పటేల్ అనే వ్యక్తి .. పాఠశాల వెనకున్న నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లాడు. ఆపై అత్యాచారం చేసి చంపేశాడు."
-మహారాష్ట్ర పోలీసులు
కనిపించకుండా పోయిన చిన్నారి జాడని ఆమె నాయనమ్మ గుర్తించగా.. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు పోలీసులు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారని వెల్లడించారు.
సంఘటనా ప్రాంతంలో పాటిల్ అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టగా.. అతనికి జనవరి 8 వరకు పోలీస్ కస్టడీ విధించింది. అతనిపై ఇదివరకే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: 'చిన్నారుల భద్రతకు హామీ ఇవ్వలేకపోతున్నచట్టాలు'