తమ కూతురు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం తెలిపిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును పరిశీలించాక స్వలింగ వివాహాలపై తనకున్న పాత ఆలోచనలను మార్చుకున్నానని జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేశ్ తెలిపారు.
వివాహం చేసుకోవాలనుకుంటున్న తమకు తల్లిదండ్రుల నుంచి ప్రమాదం ఉందంటూ మద్రాస్ హైకోర్టును ఇద్దరు అమ్మాయిలు ఆశ్రయించారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం ధర్మాసనం ఈ మేరకు తల్లిదండ్రుల్ని ఆదేశించింది.
రెండు సంవత్సరాలుగా తమ మధ్య పరిచయం ఉందని పిటిషనర్లు తెలిపారు. తమ స్నేహం ప్రేమగా మారిందని.. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని కోర్టుకు తెలిపారు.
పిటిషనర్లలో ఒక అమ్మాయి వయస్సు 22ఏళ్లు. బీఎస్సీ పూర్తిచేసి ఎంబీఏ చదువుతోంది. మరో అమ్మాయి వయస్సు 20 సంవత్సరాలు.
ఇదీ చదవండి: ఇద్దరు బాలికలపై 8 మంది అత్యాచారం