ETV Bharat / bharat

కూతుళ్లను ఇంట్లోంచి గెంటేసి తల్లి నాలుగో పెళ్లి! - unique marriage of women in bhind

ఆ మహిళకు వయసు 45. ఇప్పటికే మూడుసార్లు పెళ్లైంది. ఐదుగురు కుమార్తెలూ ఉన్నారు. అయినా.. 21 ఏళ్ల ఓ యువకుడిని ప్రేమించింది. ఆ మైకంలో మునిగి తన కూతుళ్లను ఇంటి నుంచి గెంటేసి నాలుగో పెళ్లికి సిద్ధమైంది. ఆ తర్వాత ఏమైంది?

wedding of 45 year old women
21 ఏళ్ల యువకుడితో 45 ఏళ్ల మహిళ వివాహం
author img

By

Published : Jul 11, 2021, 2:52 PM IST

ఐదుగురు కూతుళ్లు ఉన్న ఓ 45 ఏళ్ల మహిళ.. నాలుగోసారి పెళ్లికి సిద్ధమైంది. అది కూడా 21 ఏళ్ల యువకుడితో. మధ్యప్రదేశ్​ భిండ్​ జిల్లా ఝాన్సీ మొహల్లా గ్రామంలో ఈ వింత సంఘటన జరిగింది.

పదిహేనేళ్ల వయసులోనే..

పదిహేనేళ్ల వయసు ఉన్నప్పుడు ఆ మహిళకు మొదటిసారి వివాహం జరిగింది. రెండేళ్ల తర్వాత మనస్పర్థలతో భర్తతో విడాకులు తీసుకుంది. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వినోద్​ అనే వ్యక్తితో ఆ మహిళకు రెండోసారి వివాహం జరిగింది. ఆ దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు సంతానం. అయితే కొన్నేళ్ల తర్వాత వినోద్​ ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

భర్త మరణించిన తర్వాత తన ఐదుగురు కుమార్తెలతో కలిసి ఆ మహిళ తన పుట్టింటికి చేరుకుంది. అక్కడ బ్రిజేష్​ అనే ఓ యువకుడిని ప్రేమించింది. తన పుట్టింటివారు ఎంత వారించినా ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే.. కొన్నాళ్ల తర్వాత అతడు అనారోగ్యంతో మరణించాడు. అ తర్వాత భిండ్​కు చేరుకుంది. అక్కడే నివసించింది. తన ఐదుగురు కుమార్తెల్లో ఓ అమ్మాయికి పెళ్లి చేసింది.

బాయ్​ఫ్రెండ్​తో సహజీవనం..

భిండ్​ జిల్లాలోని ఝాన్సీ మొహల్లా ప్రాంతంలో నివసిస్తున్న ఆ మహిళ.. మిథున్​ అనే 21 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. చాలాకాలం పాటు వారు సహజీవనం కూడా చేశారు. అయితే.. ఈ వ్యవహారాన్ని ఆమె కూతుళ్లు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ క్రమంలో రెండో కుమార్తెను ఇంటి నుంచి ఏడాది క్రితం తరిమేసింది. ఇప్పుడు ఆ యువకుడితో వివాహానికి సిద్ధమైంది ఆమె. ముగ్గురు కుమార్తెలు కూడా ఈ పెళ్లికి అడ్డుచెప్పగా.. వారిని కూడా ఆమె తన ఇంటి నుంచి బయటకు పంపించేసింది.

wedding of 45 year old women
మిథున్​, మహిళ

'చంపేస్తానంది..'

తమ తల్లి నాలుగో పెళ్లి వ్యవహారంపై కూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. ఈ వివాహాన్ని వ్యతిరేకించినందుకు తనను హత్య చేస్తానని బెదిరించిందని ఆమె రెండో కుమార్తె తెలిపింది. పోలీసుల వద్దకు వెళ్లకుండా తమను అడ్డగించిందని చెప్పింది. పెళ్లి మాయలో పడి తన చెల్లెళ్లను కూడా తన తల్లి ఇంటి నుంచి బయటకు పంపించేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

wedding of 45 year old women
తమ తల్లి పెళ్లిని వ్యతిరేకిస్తూ పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించిన మహిళ కుమార్తెలు

రూ.6 వేల జీతంతో..

చాలారోజుల నుంచి తాను ఆ మహిళతో సహజీవనం చేస్తున్నానని ఆమె ప్రియుడు మిథున్​ చెప్పాడు. అయితే సమాజం కోసమే తామిద్దరం ఇప్పుడు వివాహం చేసుకుని ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. ఓ కిరాణ షాపులో పని చేయటం ద్వారా​ తనకు వచ్చే రూ.6,000 వేల జీతంతో ఆమె కుమార్తెలను కూడా తాను పోషిస్తున్నానని చెప్పాడు.

పోలీస్​ స్టేషన్​కు ఈ పెళ్లి విషయం చేరుకోగా.. ఈ వివాహంతో ఎదురయ్యే అనర్థాల గురించి మిథున్​కు పోలీసులు వివరించారు. దాంతో అతడు మహిళను పెళ్లి చేసుకోనని చెప్పాడు. కానీ, ఆ మహిళ మాత్రం తాను ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పట్టింది.

కౌన్సెలింగ్ ఇచ్చి..

ఈ పెళ్లి వ్యవహారంలో మహిళతో పాటు, యువకుడికీ డీఎస్పీ పూనమ్​ థాపా కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే.. ఇప్పటివరకు వీరి సమస్యకు మాత్రం ఏ పరిష్కారం దొరకలేదు. కానీ ఆ మహిళ కారణంగా నలుగురు ఆడపిల్లల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

ఇదీ చూడండి: మద్యం మత్తులో భార్య ముక్కు కొరికేసిన భర్త

ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.