Lucknow Zoo Installed Heaters: చలి నుంచి జంతువులను రక్షించేందుకు దేశవ్యాప్తంగా జంతు ప్రదర్శనశాలలు అనేక చర్యలు చేపట్టాయి. లఖ్నవూ జూలో వెయ్యి వరకూ వన్యప్రాణులు ఉన్నాయి. భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయిన తరుణంలో జంతువులను వెచ్చగా ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు.
Heaters Outside Enclosures of Tigers and Python: కొండ చిలువలు వంటి సరీసృపాలు ఉన్న ఎన్క్లోజర్లలో కంబళ్లు, హీటర్లు పెట్టారు. పులులు, సింహాలు ఉండే ఎన్క్లోజర్లలోకి చలిగాలి చొరబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జంతువులు తట్టుకునే ఉష్ణోగ్రతలు ఉండేలా చర్యలు చేపట్టారు.
![Lucknow Zoo Installed Heaters for animals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13978802_animals-cold.jpg)
నీటిలో జీవించే జంతువులను చలి నుంచి రక్షించేందుకు నీటిని సర్క్యులేషన్ చేయడం ద్వారా ఉష్ణోగ్రతలను నిరంతరం క్రమబద్దం చేస్తున్నారు. ముఖ్యంగా.. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆ సమయంలో మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం జంతువుల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు.
![Lucknow Zoo Installed Heaters for animals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13978802_animals-zoo.jpg)
Nutrition Rich Food to The Animals: శీతాకాలంలో చలి తీవ్రత కారణంగా జంతువులు జబ్బుపడకుండా ఆహారం విషయంలో కూడా అనేక మార్పులు, చేర్పులు చేసినట్లు జూ అధికారులు చెబుతున్నారు. సీజనల్ పండ్లతో పాటు ఆహారంలో లవణాలను కూడా జత చేస్తున్నారు. జంతువులు తాగే నీరు మరీ చల్లగా లేకుండా జాగ్రత్తలు చేపట్టారు. మాంసాహార జంతువులకు ఇచ్చే ఆహారంలో కూడా మార్పులు చేశారు. జంతువుల్లో రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని.. ఇస్తున్నామని జూ సిబ్బంది వివరించారు.
Baby Elephants Wear Blankets:
అసోంలో ప్రఖ్యాతిగాంచిన కాజీరంగా వన్యప్రాణి సంరక్షణ, పునరావాస కేంద్రంలోనూ జంతువులను చలి నుంచి రక్షించేందుకు.. ఇలాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నారు. అరుదైన పక్షులను ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఉంచి.. సంరక్షిస్తున్నారు. ఏనుగు పిల్లలకు దుప్పట్లు కప్పి వెచ్చగా ఉంచుతున్నారు. పోషకాలతో కూడిన ఆహారం, నీరు ఇస్తున్నట్లు అధికారులు వివరించారు.
![Baby elephants wear blankets](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13978802_cold-animal.jpg)
![Baby elephants wear blankets](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13978802_cold-animals.jpg)
ఇవీ చూడండి: కుమార్తెకు రూ.12వేలతో ఫోన్ కొని.. రూ.8వేలతో ఊరేగింపు