ETV Bharat / bharat

ప్రియురాలిని చంపిన ప్రియుడు.. 10 అడుగుల గోతిలో పాతిపెట్టి.. - సౌండ్ స్పీకర్ల కోసం బెంగళూరులో వ్యక్తి హత్య

ప్రియురాలి కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. అనంతరం తన ఫామ్​హౌస్​​లో పూడ్చిపెట్టాడు. ఈ ఘటన హరియాణాలో జరిగింది. స్పీకర్ల సౌండ్​ను తగ్గించాలని కోరిన వ్యక్తిపై టెకీలు విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

lover killed his girlfriend haryana
lover killed his girlfriend haryana
author img

By

Published : Apr 6, 2023, 7:51 AM IST

Updated : Apr 6, 2023, 8:21 AM IST

హరియాణాలో దారుణం జరిగింది. ప్రియురాలిని కెనడా నుంచి పిలిచి మరీ హత్య చేశాడో వ్యక్తి. అనంతరం ప్రియురాలి మృతదేహాన్ని తన ఫామ్​హౌస్​లో పాతిపెట్టాడు. గతేడాది జూన్​లో జరిగిన ఈ ఘటన.. దాదాపు ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు మోనిక(23) రోహ్​తక్​ ప్రాంతంలోని బాలంద్ గ్రామానికి చెందిన యువతి. ఐఇఎల్‌టీఎస్ కోర్సు చేయడానికి సోనిపత్​​ ప్రాంతంలోని గుమాడ్​ గ్రామంలోని తన అత్త ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉండే సునీల్​ అనే వ్యక్తితో మోనికకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే.. ఇదివరకే సునీల్​కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం మోనికకు కూడా తెలుసు.

ఇంతలో పై చదువుల కోసం మోనిక.. కెనడా వెళ్లింది. కొన్ని రోజులు గడిచాక.. సునీల్​ మోనికకు ఫోన్ చేసి ఇండియా రావాల్సిందిగా కోరాడు. దీంతో మోనిక ఇండియా వచ్చింది. అనంతరం ఇద్దరూ 2022 మేలో గాజియాబాద్​లోని ఓ గుడిలో పెళ్లి​ చేసుకున్నారు. ఆ వివాహాన్ని రిజిస్టర్​ కూడా చేయించారు. అనంతరం ఓ రోజు మోనికను తన ఫామ్​హౌస్​కు తీసుకెళ్లాడు సునీల్​. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సునీల్​.. మోనికను కాల్చి చంపాడు. అనంతరం మోనిక మృతదేహాన్ని.. ఇదివరకే వాటర్​ ట్యాంక్​ కోసం అని తవ్వించిన ఓ 10 అడుగుల గోతిలో పాతిపెట్టాడు. అయితే, మోనిక.. 2022 జనవరి నుంచి మే వరకు రెండు సార్లు ఇండియా వచ్చిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. మోనిక కెనడా నుంచి తిరిగి వచ్చిన విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియదు. ఆమెకు ఎన్ని సార్లు ఫోన్​ చేసినా ఫలితం లేదు. దీంతో పోలీస్ స్టేషన్​లో మిస్సింగ్​ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఏప్రిల్​ 2న నిందితుడు సునీల్​ను అరెస్టు చేశారు.

అసలు ఎందుకు చంపాడు?
సునీల్​కు తన భార్యతో ఉండటం ఇష్టం లేదు. ఎప్పుడూ విదేశాల్లో సెటిల్​ కావాలని కలలు కనేవాడు. ఈ క్రమంలో మోనిక కెనడాలో పీఆర్​(పర్మనెంట్​ రెసిడెన్సీ) పొందితే శాశ్వతంగా అక్కడే ఉండచ్చని ఆశపడ్డాడు. అయితే, అతడి ప్లాన్​ వర్కవుట్​ కాదని గ్రహించి మోనికను మర్డర్​ చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడి ఫామ్​హౌస్ నుంచి మృతదేహం అవశేషాలు స్వాధీనం చేసుకున్నామని.. పోస్టుమార్టం, డీఎన్​ఏ పరీక్షలు నిమిత్తం సోనిపత్​​ సివిల్​ ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు.

టెకీలు దారుణం..
స్పీకర్ల సౌండ్​ను తగ్గించాలని కోరిన వ్యక్తిపై టెకీలు విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన కొందరు టెకీలు ఆదివారం అర్ధరాత్రి ఫుల్​గా మందు కొట్టారు. అనంతరం పాటలు పెట్టుకుని పెద్దగా కేకలు వేయడం, అరవడం ప్రారంభించారు. దీంతో పొరుగింట్లో నివాసం ఉండే లాయిడ్‌ నేమయ్య (50) అనే వ్యక్తి వారి దగ్గరకి వెళ్లి అభ్యంతరం తెలిపారు. ఇంట్లో పెద్ద వాళ్లు ఉన్నారని.. స్పీకర్ల సౌండ్​ను తగ్గించాలని కోరారు. దీంతో కోపోద్రిక్తులైన టెకీలు.. ఆ వ్యక్తిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యులు చేపట్టారు.

Last Updated : Apr 6, 2023, 8:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.