Lok Sabha Security Breach Today : లోక్‌సభలో ఇద్దరు ఆగంతుకులు కలకలం సృష్టించిన నేపథ్యంలో పోలీసులు, దర్యాప్తు బృందాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో సీనియర్ అధికారులు పార్లమెంట్‌కు చేరుకుని, నిందితులిద్దరి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. లోక్‌సభ ఛాంబర్లోకి దూకిన ఇద్దరు నిందితులు సాగర్ శర్మ, మనోరంజన్‌ను విచారించారు. అలాగే నిందితుల నేపథ్యాన్ని పరిశీలిస్తున్నామని ఐబీ అధికారులు తెలిపారు.
-
VIDEO | Forensics team arrives at Parliament following a security breach inside Lok Sabha earlier today. pic.twitter.com/4jnUIzmweP
— Press Trust of India (@PTI_News) December 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | Forensics team arrives at Parliament following a security breach inside Lok Sabha earlier today. pic.twitter.com/4jnUIzmweP
— Press Trust of India (@PTI_News) December 13, 2023VIDEO | Forensics team arrives at Parliament following a security breach inside Lok Sabha earlier today. pic.twitter.com/4jnUIzmweP
— Press Trust of India (@PTI_News) December 13, 2023
'నిందితులిద్దరి స్వస్థలం కర్ణాటకలోని మైసూర్. నిందితుల్లో ఒకడైన సాగర్ శర్మ బెంగళూరులోని ఒక యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కాగా, సమగ్ర దర్యాప్తు కోసం స్థానిక పోలీసులతో పాటు ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా నిందితుల ఇళ్లకు వెళ్లారు. నిందితులకు ఏవైనా ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయా అనే కోణంలో ప్రశ్నించాం. విజిటర్స్ గ్యాలరీలోకి నిందితులు ప్రవేశించే ముందు వారు వచ్చిన అన్ని చెక్ పాయింట్ల సీసీటీవీల ఫుటేజీలను సేకరించాం.' అని ఐబీ అధికారి ఒకరు తెలిపారు.
మరోవైపు.. ఫోరెన్సిక్ బృందం సైతం పార్లమెంట్‌కు చేరుకుని సాక్ష్యాలను సేకరించింది. అలాగే పార్లమెంట్ బయట స్మోక్ డబ్బాలతో నిరసన చేపట్టిన హరియాణాలోని హిసార్‌కు చెందిన నీలమ్(42), మహారాష్ట్రకు చెందిన అమోల్ శిందే(25) అనే వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం
లోక్‌సభ ఛాంబర్లోకి ఇద్దరు నిందితులు దూకిన ఘటనపై సభాపతి ఓం బిర్లా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. నిందితులను పట్టుకున్నందుకు సాయపడిన లోక్‌సభ సభ్యులు, భద్రతా సిబ్బంది, మార్షల్స్‌ను అభినందించారు. 2001లో కూడా కేంద్ర పారామిలటరీ బలగాలు, ఇతర భద్రతా బలగాలు సమష్ఠిగా కృషి చేసి పార్లమెంట్‌పై ఉగ్రదాడిని నిరోధించాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. లోక్‌సభ భద్రతా వైఫల్యంపై చర్చించేందుకు బుధవారం సాయంత్రం 4గంటలకు అన్నిపార్టీల ఎంపీలతో స్పీకర్ ఓం బిర్లా సమావేశమయ్యారు.
'ఈరోజు లోక్‌సభలో జరిగిన ఘటన మనందరికీ ఆందోళన కలిగించే అంశం. అంతేకాకుండా చాలా తీవ్రమైనది కూడా. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరుగుతోంది. నిందితులపై తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం.' అని లోక్‌సభలో ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా. అనంతరం లోక్‌సభను గురువారం ఉదయం 11గంటలకు వాయిదా వేశారు.
-
#WATCH | Lok Sabha security breach | Lok Sabha Speaker Om Birla says, "The incident that happened today is a topic of concern for all of us & is serious as well...A high-level investigation is being done & accordingly action will be taken. A comprehensive review will be done… pic.twitter.com/S3SopKopWM
— ANI (@ANI) December 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Lok Sabha security breach | Lok Sabha Speaker Om Birla says, "The incident that happened today is a topic of concern for all of us & is serious as well...A high-level investigation is being done & accordingly action will be taken. A comprehensive review will be done… pic.twitter.com/S3SopKopWM
— ANI (@ANI) December 13, 2023#WATCH | Lok Sabha security breach | Lok Sabha Speaker Om Birla says, "The incident that happened today is a topic of concern for all of us & is serious as well...A high-level investigation is being done & accordingly action will be taken. A comprehensive review will be done… pic.twitter.com/S3SopKopWM
— ANI (@ANI) December 13, 2023
అంతకుముందు మధ్యాహ్నం 2గంటలకు సభ తిరిగి సమావేశం కాగానే ఇటీవల ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ విడుదల చేసిన వీడియో అంశాన్ని పలువురు సభ్యులు లేవనెత్తారు. ఆ విషయాన్ని సభలో చర్చించటం సరికాదన్న స్పీకర్ ఓంబిర్లా సభలోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులతోపాటు బయట ఉన్న మరో ఇద్దర్నీ కూడా అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.