కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేరళలో పూర్తి స్థాయి లాక్డౌన్ విధించింది విజయన్ సర్కార్. కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మే 8 నుంచి 16 వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. మే 16 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని కేరళ సీఎం పినరయి విజయన్ వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రంలో లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలవుతున్నాయి. కరోనా తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌వైపు సర్కారు మొగ్గుచూపింది.
బుధవారం కేరళలో గరిష్ఠ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. బుధవారం ఏకంగా 41,953 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
ఇదీ చదవండి: అక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్!