ETV Bharat / bharat

2020లో రైల్వే ట్రాక్​లపై ఎంతమంది మృతి చెందారంటే? - railway track deaths

2020లో ట్రాక్​లపై 8,733 మంది ప్రాణాలు కోల్పోయారని రైల్వే శాఖ వెల్లడించింది. ఇందులో చాలా మంది వలసకూలీలే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అంతకు ముందు నాలుగేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే అయినప్పటికీ.. ప్యాసెంజర్ రైళ్లు నిలిచిపోయిన సమయంలో ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం గమనార్హం.

Lockdown 2020: Over 8,700 people died on railway tracks
రైల్వే ట్రాక్​లపై 8,733 మంది మృతి
author img

By

Published : Jun 2, 2021, 6:19 PM IST

లాక్​డౌన్ కారణంగా 2020లో ప్యాసెంజర్ రైళ్లు కొంతకాలం నిలిచిపోయినప్పటికీ ట్రాక్​పై మరణించినవారి సంఖ్య అధికంగానే నమోదైంది. ఆ ఏడాది 8,733 మంది ట్రాక్​లపైనే ప్రాణాలు కోల్పోయారని రైల్వే బోర్డు తెలిపింది. మధ్యప్రదేశ్​కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్​టీఐ దరఖాస్తుకు స్పందనగా ఈ వివరాలు వెల్లడించింది.

  • 2020 జనవరి-డిసెంబర్ మధ్య 8733 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రాష్ట్రాల పోలీసుల సమాచారం ప్రకారం 805 మంది గాయపడ్డారు.
  • 2016-19 మధ్య 56,271 మంది మరణించారు. 5,938 మంది గాయపడ్డారు.

నాలుగేళ్లలో ఇలా..

ఏడాదిమృతులు
2016 14,032
201712,838
201814,197
201915,204

వలస కూలీలే అధికం!

గత నాలుగేళ్లతో పోలిస్తే 2020లో మరణాలు తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే రైళ్ల రాకపోకలు కొద్ది కాలం పాటు నిలిచిపోవడం ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. ఆ ఏడాది మరణించిన వారిలో చాలా వరకు వలస కూలీలే ఉన్నారని వెల్లడించారు. రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల దారి తెలియక రైల్వే ట్రాక్​పై నడుచుకుంటూ ఎంతో మంది కూలీలు తమ స్వస్థలలాకు వెళ్లారు. లాక్​డౌన్​లో పోలీసుల కంట పడకుండా ఉండటం సహా రోడ్డు మార్గంతో పోలిస్తే దగ్గరి దారి అనే భావన ఉన్నందున రైల్వే ట్రాక్​పైనే నడుస్తూ.. తమ ప్రయాణం సాగించారు. ఈ క్రమంలో ప్రమాదాలు సంభవించి మరణించారని అధికారులు తెలిపారు.

మార్చి 25న లాక్​డౌన్ ప్రకటించిన తర్వాత.. ప్యాసెంజర్ సర్వీసులు నిలిచిపోయాయి. మే 1న శ్రామిక్ రైళ్లు ప్రారంభించేంత వరకు.. గూడ్స్ రైళ్లు మాత్రమే నడిచాయి. దశలవారిగా సేవలను రైల్వే శాఖ పునరుద్ధరించింది. డిసెంబర్ నాటికి 1100 ప్రత్యేక రైళ్లు, 110 సాధారణ ప్యాసెంజర్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.

ఇదీ చదవండి:

ఆత్మహత్యలకు చిరునామాగా మారుతున్న రైల్వేట్రాక్​లు

ఇంటి అద్దె చట్టానికి కేబినెట్​ ఓకే- కీలకాంశాలు ఇవే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.