కేరళలో అధికార మార్పిడి సంప్రదాయానికి చరమగీతం పాడి చరిత్ర సృష్టించే దిశగా కామ్రేడ్లు దూసుకెళ్తున్నారు. యూడీఎఫ్పై స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 140 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ తరఫున నిమోమ్ నుంచి పోటీ చేసిన కుమ్మనమ్ రాజశేఖరన్, పాలక్కడ్ అభ్యర్థి మెట్రో మ్యాన్ శ్రీధరన్ మాత్రం ఆధిక్యంలో ఉన్నారు.