దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో శనివారం సాయంత్రం ఆయనను దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించిన్నట్లు రాంచీ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
దాణా కుంభకోణంలో దోషిగా తేలడంతో 2017 డిసెంబరు నుంచి రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ.. చాలా కాలంగా పలు రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో గురువారం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. దీంతో వెంటనే ఆయనను రిమ్స్ ఆసుపత్రికి తరలించిన జైలు అధికారులు.. లాలూ కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.
ఆసుపత్రిలో లాలూకు కొవిడ్ పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. స్థానిక కోర్టు నుంచి అనుమతి లభించాకే ఆయనను ఎయిమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.